కొర్ర తండా గ్రామంలో బెల్లం పానకం ధ్వసం చేసిన పోలీసులు -  మత్తు పదార్థాల పై పోలీసులు అవగాహన కార్యక్రమం 

fff సంస్థాన్  నారాయణపురం,విశ్వంభర :- యాదాద్రి భువనగిరి జిల్లా, సంస్థాన్  నారాయణపురం మండల పరిధిలోని కొర్ర తండా గ్రామంలో  ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నిర్వహించిన దాడుల్లో 50 లీటర్ల పానకం పట్టుకున్నారు పోలీసులు.పానకాన్ని నిల్వ ఉంచిన డ్రమ్ములను పోలీసులు ధ్వంసం  చేయడం జరిగింది.ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకొని బైండోవర్ చేసారు. పోలీసులు చేసిన దాడులలో బెల్లం పానకం ధ్వసం చేయడంతో పాటు డ్ర***గ్స్ , గం***జాయి మత్తు పదార్ధాలను క్రయ విక్రయాలతో పాటు సేవించిన , మరొకచోటకు తరలించిన కఠిన పరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.మత్తు పదార్ధుల పై పోలీసులు అవగాహన కల్పించారు 

Advertisement

LatestNews