మహిళల పై అనుచితంగా ప్రవర్తించిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసిన పోలీసులు 

మహిళల పై అనుచితంగా ప్రవర్తించిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసిన పోలీసులు 

విశ్వంభర, శాలిబండ : మహిళల పై అనుచితంగా ప్రవర్తించిన ఇద్దరు వ్యక్తులను శాలిబండ పోలీసులు అరెస్టు చేసారు. ఎస్సై మహేష్ గౌడ్  తెలిపిన వివరాలు ప్రకారం శాలిబండ ప్రాంతానికి చెందిన మహమ్మద్ అయాన్ , మొహమ్మద్ హుస్సేన్  ఇద్దరు శాలిబండ ప్రాంతంలో ఒక యువతి పై అసభ్యంగా ప్రవర్తించారని బాధితుల పిర్యాదు పై  షమ నూర్  పెట్రోలింగ్ కారు సిబ్బంది నిందితులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని వారి పై పెట్టి కేసు బుక్ చేసి వారిని కోర్టు కానిస్టేబుల్ ఎం బాలు  నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. కేసు పూర్వోపారాలు పరిశీలించిన 9వ ప్రత్యేక జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి మంద మురళి ఇద్దరికీ ఏడు రోజుల జైలు శిక్ష విధించారు.

Tags: