తాళ్ళపెల్లి ఉదయ్ భౌతిక ఖాయానికి నివాళులర్పించిన - పల్లా సుందర్ రాంరెడ్డి

తాళ్ళపెల్లి ఉదయ్  భౌతిక ఖాయానికి నివాళులర్పించిన  - పల్లా సుందర్ రాంరెడ్డి

విశ్వంభర , జనగాం జిల్లా :  దేవరుప్పుల మండలం సింగరాజు పల్లి గ్రామంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తాళ్ళపల్లి ఉదయ్ మృతదేహానికి  బిఆర్ఎస్ పార్టీ జనగామ జిల్లా నాయకులు పల్లా సుందర్ రాంరెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు.  ఈ సందర్బంగ వారి కుటుంబాన్ని పరామర్శించి 25 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించి,  కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు మేకపోతుల నరసింహ గౌడ్, నియోజకవర్గం యూత్ అధ్యక్షుడు గడ్డం రాజు, మాజీ ఏఎంసీ డైరెక్టర్ కుతాటి నరసింహులు , మండల యూత్ నాయకుడు బానోత్ నవీన్ నాయక్, మండల నాయకులు, కత్తుల విజయ్  కుమార్ రెడ్డి, కత్తుల సోమిరెడ్డి, అన్నారపు స్వరూపా యాదగిరి, నోముల వీరన్న,గ్రామ పార్టీ ప్రధాన కార్యదర్శి మేడరాజు మాజీ సర్పంచులు గోపాల్ దాస్ మల్లేష్, రచ్చ ఎల్లప్ప నాయకులు కొమ్ము రాములు తదితరులు పాల్గొన్నారు.

Tags:  

Advertisement