మోడీ, మంద కృష్ణ లకు పాలాభిషేకం 

మోడీ, మంద కృష్ణ లకు పాలాభిషేకం 

విశ్వంభర, ఎల్బీనగర్ : ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు ఆమోదం తెలిపిన సందర్భంగా ఎల్బీనగర్, హయత్ నగర్, మన్సూరాబాద్ డివిజన్ ప్రాంతాలలో అంబేడ్కర్ విగ్రహాల వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, మందకృష్ణ మాదిగలకి పాలాభిషేకం చేసారు. SC మోర్చా అధ్యక్షులు పారంద సాయి నేతృత్వంలో జరిగిన పాలభిషేకం కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్  కొప్పుల నర్సింహ్మా రెడ్డితో కలిసి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సాయి మాట్లాడుతూ 30 ఏండ్లు,3 దశాబ్దాలు అలుపెరగని పోరాటం, ఎన్నో అవమానాలను తట్టుకొని జాతి భవిష్యత్తుకై పోరాడుతూ ఎస్సీ ఎబిసిడి  వర్గీకరణను ఆమోదం తెలపాలని ఎమ్మార్పీఎస్ మందకృష్ణ మాదిగ , ఎమ్మార్పీఎస్ నాయకులు తో కలసి న్యాయ పోరాట పటిమతో సాధించాలని గత ప్రభుత్వాలకు ఎన్నిసార్లు మద్దతు తెలిపాలని కోరిన నిమ్మకు నీరెత్తినట్లు కాంగ్రెస్,తెరాస ప్రభుత్వాలు వ్యవహరించిన, తన దృఢ సంకల్పంతో పోరాడి వర్గీకరణను అంతిమ విజయం సాధించారని అన్నారు. అదేవిధంగా బిజెపి తెలంగాణ రాష్ట్ర కేంద్ర మంత్రులు, జాతీయ మంత్రులు , బిజెపి కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఈరోజు వర్గీకరణ అమలు కావడం ఆనందం వ్యక్తం చేస్తూ బాణాసంచాలు కాల్చి, స్వీట్లు తినిపించుకొని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో  కిరణ్, జగన్, శ్రీను, చిరు,యాదయ్య, రామేశ్వర, హరీష్ రెడ్డి, ముత్యం రెడ్డి, కవిత రెడ్డి, శ్రీధర్ గౌడ్, సాయి రామ్ గౌడ్, రాజేష్ గౌడ్, జయతేజ, రోహిత్ రెడ్డి, నర్సిముడు, శ్యామ్ సుందర్ రెడ్డి, ఎల్లా రెడ్డి, రవితేజ, దశరథ్, గోవింద్ రెడ్డి, మధుసూధన్ రెడ్డి, భారత్, సిద్ధార్థ్, సంతోష్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tags: