సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన చేనేత కార్మికులు, పద్మశాలీలు

సీఎం రేవంత్ రెడ్డికి  కృతజ్ఞతలు తెలిపిన చేనేత కార్మికులు, పద్మశాలీలు

  • చేనేత కార్మికులకు రూ. లక్ష రుణ మాఫీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం. 
  • రుణమాఫీకి కృషి చేసిన స్థానిక ఎమ్మెల్యే  కోమటిరెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు 

విశ్వంభర, చండూరు : సీఎం రేవంత్ రెడ్డి చేనేత కార్మికులకు రూ. లక్ష  రుణమాఫీ ప్రకటించి జీవో విడుదల చేసిన సందర్భంగా చండూరులో కార్మిక సంఘం ఆధ్వర్యంలో సోమవారం స్థానిక మార్కండేశ్వర స్వామి దేవాలయంలో కృతజ్ఞత సమావేశాన్ని  నిర్వహించారు.  ఈ సందర్భంగా పద్మశాలి సంఘం చండూరు పట్టణ అధ్యక్షుడు  గుర్రం బిక్షమయ్య మాట్లాడుతూ పార్టీలకతీతంగా  పద్మశాలీలందరూ  సమిష్టిగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. గాంధీజీ ఫౌండేషన్ చైర్మన్, ట్రస్మా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ  చేనేత కార్మికులకు, పద్మశాలీలకు తాను అన్ని విధాల అండగా ఉంటానని  స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  అన్ని విధాల కృషి చేస్తున్నారని తెలిపారు. పద్మశాలీల కోసం  కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ. లక్ష విరాళాలని ఈ సందర్భంగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పట్టణ పద్మశాలి సంఘం గౌరవ అధ్యక్షుడు పులిపాటి ప్రసన్న, గౌరవ సలహాదారుడు కోడి గిరి బాబు, కార్మిక సంఘం ఉపాధ్యక్షుడు జూలూరు వెంకటేశం,  పట్టణ పద్మశాలి సంఘం ఉపాధ్యక్షుడు  పున్న ధర్మేందర్, ఉభయ దేవాలయాల చైర్మన్ రావిరాల నగేష్, పట్టణ పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి గంజి శ్రీనివాసులు, చిట్టిప్రోలు వెంకటేశం, సంగెపు మల్లేష్, బొల్ల జనార్ధన్, సంగెపు శ్రీనివాసులు, తిరందాసు ఆంజనేయులు, సిపిఎస్ ఫౌండర్ చైర్మన్ రాపోలు ప్రభాకర్, చైర్మన్ చెరుపల్లి కృష్ణ, కర్నాటి శ్రీను, యువజన సంఘం అధ్యక్షుడు గంజి  గంగాధర్, సిపిఎస్  గౌరవ సలహాదారులు ఏలే శ్రీను, సంగెపు శ్రీను, రావిరాల రాజు,  అశోక్, బిక్షం, మణికుమార్ రవి భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.

Tags: