చేనేత వృత్తి కాదు.. మన అస్తిత్వం  - రిటైర్డ్ ఐఏఎస్ టి . చిరంజీవులు

చేనేత సంక్షేమమే మా ధ్యేయం - తెలంగాణ చేనేత ఐక్య వేదిక అధ్యక్షడు రాపోలు వీర మోహన్ 

చేనేత వృత్తి కాదు.. మన అస్తిత్వం  - రిటైర్డ్ ఐఏఎస్ టి . చిరంజీవులు

  • రైతన్నకు ఉన్న గుర్తింపు నేతన్నకు లేదు  బీసీ సంక్షేమ  సంఘం జాతీయ ఉపాధ్యక్షులు  గుజ్జ సత్యం 
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక బడ్జెట్ ను విడుదల చేయాలి- హై కోర్టు సీనియర్ అడ్వకేట్ రాపోలు భాస్కర్ 
  • మనందరి రోజు  చేనేత దినోత్సవం -జాతీయ చేనేత దినోత్సవ రూపకర్త యర్రమాద వెంకన్న
  •  

విశ్వంభర, తుర్క యంజాల్ : తెలంగాణ చేనేత ఐక్య వేదిక ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు పురస్కరించుకొని తుర్క్ యంజాల్ లోని పద్మశాలి భవన్ లో  తెలంగాణ చేనేత ఐక్య వేదిక - అధ్యక్షుడు రాపోలు వీర మోహన్ నేత అధ్యక్షతన చేనేత కళాకారులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. చేనేత జెండాను ఆవిష్కరణ చేసిన  అనంతరం  అధ్యక్షుడు రాపోలు వీర మోహన్ నేత మాట్లాడుతూ రాష్టంలో చేనేత దినోత్సవాన్ని అధికారికంగా జరుపుతున్న నేపథ్యంలో అధికార ఆహ్వాన పత్రికలో పద్మశాలి , చేనేత ప్రజాప్రతినిధులు , నాయకుల పేర్లు లేకపోవడం దౌర్భాగ్యకరమని అన్నారు. చేనేత దినోత్సవ రూపకర్త అయిన యర్రమాద వెంకన్న నేతకు ప్రభుత్వం నుండి ఆహ్వానం అందకపోవడం దారుణమని అన్నారు. ప్రభుత్వం వెంటనే పునరాలోచించి వెంకన్న నేతను అధికార కార్యక్రమంలో భాగం చేసుకొని , ప్రభుత్వపరంగా చేనేత పరిరక్షణ కు ప్రభుత్వ సలహాదారులుగా తీసుకోవాలని అన్నారు. చేనేత కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా మా ఐక్య వేదిక పోరాటం చేస్తుందని అన్నారు. చేనేత  కార్మికుల  హక్కుల కోసం ఎంతటి  త్యాగానికైనా సిద్దమే అని అన్నారు.    ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా బీసీ మేధావుల ఫోరమ్ రిటైర్డ్ ఐఏఎస్ టి . చిరంజీవులు మాట్లాడుతూ చేనేత అంటేనే చైతన్యం అని అలాంటి  చేనేత కార్మికులను ప్రభుత్వాలు ఓట్ల కోసం వాడుకుంటున్నాయి తప్ప.  వారి సంక్షేమం కోసం ఆలోచించిన దాఖలాలు లేవు . చేనేత అంటే వృత్తి కాదు అది మన అస్తిత్వం అని  అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షేమం కోసం వెయ్యి కోట్ల బడ్జెట్ ను విడుదల చేయాలనీ అన్నారు. అలాగే హై కోర్టు సీనియర్ అడ్వకేట్ రాపోలు భాస్కర్ మాట్లాడుతూ చేనేత కార్మికుల కష్టానికి ప్రతిఫలంగా నిధులను విడుదల చేయాలనీ , కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ ను విడుదల చేయాలనీ కోరారు. చేనేత సంక్షేమం కోసం పాటు పడాలని అన్నారు. చేనేత సంఘాలను బలోపేతం చేసి చేనేత వ్యవస్థను కాపాడాలని కోరారు. బీసీ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు  గుజ్జ సత్యం మాట్లాడుతూ చేనేత వృత్తిని కూడా గుర్తించి జాతీయ స్థాయిలో ఆగస్ట్ 7 న  చేనేత దినోత్సవం జరుపుకోవడం సంతోషమని అన్నారు. చాల వరకు చేనేత కార్మికులు ఉన్న వృత్తిని వదులుకొని వలసపోతున్న వారు ఎందరో . ఎన్నో ఇబ్బందులను ఎదురుకుంటూ సబ్సిడీ , మాఫీలు , థ్రిఫ్టు ఫండ్ అప్లై చేసుకోవాలన్న సవాలక్ష సవాళ్ళను ఎదురుకొని ముందుకు సాగే జీవితం మనది. రైతన్నకు ఉన్న గుర్తింపు నేతన్నకు లేదు. ఎందుకంటే రాజకీయా చైతన్యం లేకే ఇలాంటి పరిస్థితి మనది. అందుకే రాజ్యాధికారం దిశగా అడుగులు వేసి మనమే అధికారం పొంది మనవాళ్లకు ఏమి కావాలో మనమే ఇచ్చుకుందాం అని అన్నారు. జాతీయ చేనేత దినోత్సవ రూపకర్త యర్రమాద వెంకన్న మాట్లాడుతూ టైలర్ డే అని ఒక వార్త పత్రికలో చదివినప్పుడు నాలో కలిగిన చిన్న ఆలోచన , టైలర్ కుట్టేది బట్ట అలాంటి బట్టను సృష్టించే మనకు ఒకరోజు అంటూ లేకపోవడం చాలా బాధను కల్గించింది. అప్పుడు మొదలైన ఆలోచన ద్వారా   దశాబ్ద కాలంగా సాగిన ఈ చేనేత ఉద్యమం ద్వారా   ఎన్నో ఆటుపోట్లను , ఆవరోధాలను , అడ్డంకులను దాటుకొని ముందుకు సాగడం జరిగింది. ఏంతో  మంది ఎన్నో విధాలుగా అపహాస్యం చేసారని , అయినా మొక్కువోని దీక్షతో ప్రయాణం కొనసాగించాను. ఆ ప్రయత్న ఫలితమే నేడు ఈ జాతీయ చేనేత దినోత్సవము అని అన్నారు. చేనేత కార్మికుల కష్టాలు తెలిసినవాడిని అని, చేనేత సంక్షేమం కోసం నిరంతరం పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు.  ఈ కార్యక్రమంలో కోశాధికారి జెల్ల రఘు, ఉపాధ్యక్షులు ఎలిగేటి శ్రీనివాస్, విజయలక్ష్మి, సబ్బని కృష్ణ, హరీ, గాజుల భగవాన్ నేత, సామల స్వప్న, మనోహర్, జెల్ల పర్వతాలు , రావిరాల శ్రీనివాస్ నేత, అందే జ్యోతి, కృష్ణ వేణి తదితరులు పాల్గొన్నారుSequence 16.00_04_52_09.Still011

 

Tags: