ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు సన్మానం

ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు సన్మానం

విశ్వంభర, బషీర్ బాగ్: మహిళలు స్వయం సమృద్ధి సాధించడం వల్ల సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం పెరుగుతాయని హైకోర్టు మాజీ న్యాయమూర్తి, ఆంధ్రప్రదేశ్ అడ్మిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ కోర్టు మాజీ ఛైర్మన్ జస్టిస్ వామన్ రావు అన్నారు. తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఇందిరా ప్రియదర్శిని ప్రభుత్వ డిగ్రీ మహిళా కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థినులకు న్యాయమూర్తి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఆడపిల్ల ఇంటికి మహాలక్ష్మి అని నేటి మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, అంతరిక్షానికి సైతం వెళ్లి వస్తున్నారని అన్నారు. అమెరికా చికాగో రాష్ట్రానికి చెందిన సంస్థ సుబేదర్ అమీర్ అలీ ఖాన్ గ్లోబల్ పీస్ ఫౌండేషన్, ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు ఫరూక్ అలీ ఖాన్ మాట్లాడుతూ మహిళలకు భద్రత, రక్షణ లేకపోవడం ఆందోళనకు గురి చేస్తుందని, ఇంతటి వివక్షలోనూ ధైర్యంగా నిలబడి పురుషులతో సమానంగా ఉన్నత స్థాయికి ఎదిగి గుర్తింపు తెచ్చుకుంటున్నారని అన్నారు. తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ రాష్ట్ర శాఖ అధ్యక్షులు డాక్టర్ రాజ్ నారాయణ ముదిరాజ్ మాట్లాడుతూ మహిళల ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ గుర్తించాలని, ఆర్థిక, దేశాభివృద్ధికి మహిళలు తోడ్పాటు నందిస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా విద్యావేత్త ఇట్టా ఉదయశ్రీ, యాస్మిన్ కౌసర్, డాక్టర్ ధనంజయ్ హైకోర్టు న్యాయవాది, విద్యావేత్త డాక్టర్ రవితేజ తదితరులు పాల్గొని ప్రసంగించారు.ఈ సందర్భంగా ఇందిరా ప్రియదర్శిని మహిళా డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు కుమారి ఏ.సృజన గౌడ్, కుమారి రేసు వైష్ణవి, కుమారి తహసీన్ సభ లను జస్టిస్ వామాన్ రావు శాలువాతో ఘనంగా సన్మానించారు.

Tags: