ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో సీసీ రోడ్డు పనులు ప్రారంభం
విశ్వంభర, పరిగి : మండల పరిధిలోని రాఘవాపూర్ గ్రామంలో సోమవారం ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సహకారంతో పరిగి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మూల సత్యనారాయణ రెడ్డి ఎన్ఆర్ఈజీఎస్ 8 లక్షల రూపాయలతో సి సి రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సహకారంతో దశలవారీగా గ్రామంలోని ప్రతి వార్డులో అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. గ్రామ అభివృద్ధిలో ప్రజలంతా భాగస్వాములు కావాలని, అభివృద్ధికి సహకరించాలని కోరారు. త్వరలోనే ఎస్సీ సబ్ ప్లాన్ క్రింద మంజూరైన ఐదు లక్షల రూపాయలతో సీసీ రోడ్డు పనులు ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. అండర్ డ్రైనేజీ పనులు కోసం ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిని కోరగా సానుకూలంగా స్పందించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాములు, ఎస్సీ సెల్ అధ్యక్షులు జంగయ్య, కాంగ్రెస్ నాయకులు నారాయణరెడ్డి, శ్రీనివాస్, అంజిలయ్య, విజయ్ కుమార్, యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.