2.50 కోట్లతో మంజూరైన నూతన రోడ్లు

కొంపల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తా: కూన శ్రీశైలం గౌడ్.

2.50 కోట్లతో మంజూరైన నూతన రోడ్లు

  • 45 రోజుల్లో ప్రభుత్వం నుండి నిధులు విడుదల: జమ్మి దేవేందర్
  • కొంపల్లి ప్రజల తరఫున ఇన్చార్జి మంత్రి శ్రీ శ్రీధర్ బాబుకి ధన్యవాదాలు

విశ్వంభర, కొంపల్లి: కొంపల్లి మున్సిపాలిటీలో సోమవారం నాడు మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నాయకులు కూన శ్రీశైలం గౌడ్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భైరి ప్రశాంత్ గౌడ్, సీనియర్ నాయకులు జమ్మి దేవేందర్ తో కలిసి పర్యటించారు. ఇందులో భాగంగా నూతంగా హెచ్.ఎం.డి.ఏ. నిధులతో 2.50 కోట్లతో మంజూరైన నూతన రోడ్లను ఉన్నత అధికారులతో కలిసి పరిశీలించారు. జనవరి 30 వ తేదీన కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని అపర్ణ కాలనీ, నూజివీడు కాలనిలో పాదయాత్ర చేసినప్పుడు ఇచ్చిన మాట ప్రకారం కావాల్సిన నిధులను ప్రభుత్వం నుండి తీసుకొస్తానని ఇన్చార్జి మంత్రి శ్రీధర్ బాబుతో చర్చించి రెండు కోట్ల యాభై లక్షల నిధులను తీసుకురవం జరిగిందని అన్నారు. కొంపల్లి మున్సిపాలిటీ అధ్యక్షులు మరియు సీనియర్ నాయకులూ జమ్మి దేవేందర్ మిగతా నాయకుల విన్నపంతో మున్సిపాలిటీకి నిధులు మంజూరు అయ్యాయని అన్నారు. ప్రతి ఒక్క కార్యకర్త తమతమ కాలనిలో ఉన్న సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని కావలసిన నిధులను ఉన్నత నాయకులతో అధికారులతో చర్చించి అందరికి అందుబాటులో ఉంటానని వారు హామీ ఇచ్చారు. పని చేసే ప్రభుత్వం పై బురదజల్లే ప్రయత్నం చేసే సహించేది లేదని మున్సిపాలిటీ కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేసారు. గడిచిన పది సంవత్సరాలు కుటుంబ పరిపాలనకే పరిమితం అయ్యారు తప్ప ప్రజలకు చేసింది ఏమి లేదని రానున్న రోజుల్లో కూడా కొంపల్లి మున్సిపాలిటీ లో కాగ్రెస్ పార్టీ జెండా అగరవేయాలని ప్రతి ఒక్కరు కష్టపడాలని కార్యకర్తలకు, నాయకులకు వారు సూచించారు. ఈ కార్యక్రమంలో కొంపల్లి మున్సిపాలిటీ పట్టణ అధ్యక్షులు బైరి ప్రశాంత్ గౌడ్,కొంపల్లి మాజీ సర్పంచ్ దేవేందర్,శివకుమార్ గౌడ్,మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా లేబర్ సెల్ అధ్యక్షుడు కందాడి సుదర్శన్ రెడ్డి,జయభేరి గోపాల్ రెడ్డి,మోహన్ రెడ్డి,అపర్ణా గోపాల్ రెడ్డి.ఎర్రోళ్ల కృష్ణ,రాము గౌడ్,ఎత్తిరాజా రావు,కావలి గోపాల్,అంజి ముదిరాజ్,షైక్ ఇబ్రహీం,కాలనీ అధ్యక్షులు నాగిరెడ్డి, ఉపాధ్యక్షులు వెంకటరమణ,సెక్రటరీ మహేష్ పాల్గొన్నారు.

Tags: