జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు

జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు

 విశ్వంభర, ఉప్పుగూడ : శ్రీ భక్త మార్కండేయ పద్మశాలి సంఘం తానాజీ నగర్ ఉప్పుగూడలో జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు, ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు గుర్రం ఆంజనేయులు మాట్లాడుతూ భారత స్వాతంత్ర ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించి స్వాతంత్ర సమపార్జ నకు ఒక సాధనంగా నిలిచింది చేనేత అని మన జాతిపిత గాంధీజీ కూడా రాట్నంపై నూలు వడకడానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారని, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతీయ చేనేత దినోత్సవాన్ని చెన్నైలో ప్రారంభించారని ఆయన చెప్పుకొచ్చారు.ఈ కార్యక్రమంలో పద్మశాలి కుల బాంధవులు అధిక సంఖ్యలో పాల్గొని యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Tags: