రాపోలు కు ఘన స్వాగతం - తెలంగాణ చేనేత ఐక్య వేదిక నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు 

 రాపోలు కు ఘన స్వాగతం - తెలంగాణ చేనేత ఐక్య వేదిక నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు 

విశ్వంభర, నిజామాబాదు : తెలంగాణ చేనేత ఐక్య వేదిక నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా  తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు రాపోలు వీర మోహన్ కు జిల్లా కమిటీ సభ్యులు , జిల్లా పద్మశాలి సంఘం నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం జరిగిన సభలో వివిధ చేనేత సామాజిక సంక్షేమం మీద పరిశ్రమ స్థితి గతుల మీద సుదీర్ఘంగా చర్చించి మాట్లాడారు. నేడు చేనేత పరిశ్రమ ద్వారా ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు చేసుకుంటూ నేత వస్త్రాలు ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. చేనేత పేరుకు గొప్ప, ఊరు దిబ్బ అన్నట్టు చందంగా ఉందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత సంక్షేమానికి ప్రత్యేక నిధులతో పాటు , బడ్జెట్ ను కేటాయించాలని అన్నారు. ప్రతి చేనేత కార్మికుడి కోసం ఐక్య వేదిక పోరాటం చేస్తుందని అన్నారు. ఏ సమయాన అయినా ఎక్కడ అయినా చేనేత కార్మికుడికి సమస్య వస్తే ఆ సమస్యకు ముందుండి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురికి చేనేత ఐక్య వేదిక నియామక పత్రాలు అందజేయడం జరిగింది. అనంతరం స్థానిక చేనేత కార్మికులకు సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమం జిల్లా కమిటీ అధ్యక్షులు తన్నీరు శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సభలో జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు బిజ్జు దత్తాద్రి గౌరవ అధ్యక్షులు దీకొండ యాదగిరి వర్కింగ్ ప్రెసిడెంట్ , పులగం హన్మాండ్లు నగర పద్మశాలి సంఘం అధ్యక్షులు పెంట దత్తాద్రి,  మాజీ అప్కో డైరెక్టర్ వేముల ప్రకాశ్ ,జిల్లా తెలంగాణ చేనేత ఐక్య వేదిక , ప్రధాన కార్యదర్శి మెరుగు శ్రీనివాస్ , అధ్యక్షుల వారితో పాటు కామారెడ్డి జిల్లా నుండి రాష్ట్ర ఉపాధ్యక్షులు సబ్బం కృష్ణ హరి,  జిల్లా కమిటీ అధ్యక్షులు  సబ్బం ధర్మపురి , రావిరాల శ్రీనివాస్ నేత సోషల్ మీడియా కార్యదర్శి పాల్గొన్నారు

Tags: