జాతీయ దంతవైద్యుల దినోత్సవం

5కే రన్ వాల్కథాన్ జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే నాయిని

జాతీయ దంతవైద్యుల దినోత్సవం

విశ్వంభర, హనుమకొండ: జాతీయ దంత వైద్యుల దినోత్సవం సందర్భంగా హనుమకొండ జిల్లా ఇండియన్ డెంటల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 5కే రన్ (వోల్కాథాన్) కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి హాజరయ్యారు. రిబ్బన్ కట్ చేసి, జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మార్చి 6న జరుపుకునే జాతీయ దంతవైద్యుల దినోత్సవం, నోటి ఆరోగ్యం పరిశుభ్రత గురించి అవగాహనను గణనీయంగా ప్రోత్సహిస్తుందని తెలిపారు. మంచి నోటి ఆరోగ్యాన్ని కాపాడు కోవడానికి నోటి వ్యాధులను నివారించడానికి అవిశ్రాంతంగా పనిచేసే దంతవైద్యులు దంత నిపుణుల సహకారాన్ని ఈ ప్రత్యేక దినోత్సవం గౌరవించుకోవడం మన భాధ్యత అని గుర్తుచేశారు. ఇది ప్రజలు క్రమం తప్పకుండా దంత తనిఖీలు బ్రషింగ్  ఫ్లాసింగ్తో సహా ముఖ్యమైన నోటి పరిశుభ్రత పద్ధతులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. వరంగల్ నగర ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టిన ఇండియన్ డెంటిస్ట్ అసోసియేషన్ జిల్లా కమిటీకి, సభ్యులకు, వైద్యులకు ఎమ్మెల్యే నాయిని ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.ఈ వేడుకల్లో ఇండియన్ డెంటల్ అసోసియేషన్ జిల్లా కమిటీ, డాక్టర్ లు, తదితరులు పాల్గొన్నారు.

Tags: