హన్మకొండలో భీమారం లో 6వ బ్రాంచ్ ని ప్రారంభించిన విద్యాసంస్థల అధినేత  నరేందర్ రెడ్డి

హన్మకొండలో భీమారం లో 6వ బ్రాంచ్ ని ప్రారంభించిన విద్యాసంస్థల అధినేత  నరేందర్ రెడ్డి

విశ్వంభర, హనుమకొండ : అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి.నరేందర్ రెడ్డి  స్థానిక హన్మకొండలో భీమారంలో ఆల్ఫోర్స్ 6వ శాఖను  సాంప్రదాయబద్ధంగా వేద బ్రాహ్మణుల సమక్షంలో జ్యోతి ప్రజ్వలన చేసి గణపతి  పూజ నిర్వహించి ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హన్మకొండలో ప్రారంభించిన నాటి నుండి అల్ఫోర్స్ వివిధ విభాగాలలో సంచలనాత్మక ఫలితాలతో పాటు నాణ్యతమైన విద్యను అందించడంలో అగ్రగామి అని. విద్యార్థులకు భారతదేశంలో అగ్రశ్రేణిలో ఉన్న అధ్యాపకులచే  విశిష్టంగా శిక్షణ ఇప్పిస్తున్నామని  తెలిపారు.అన్ని రకాల వసతులు కల్పిస్తూ వారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీస్తున్నామని చెప్పారు. హన్మకొండలో ప్రారంభించిన నాటి నుండి అల్ఫోర్స్ విద్యాసంస్థలు దినదిన అభివృద్ధి చెందుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు. చక్కటి ప్రణాళికలు మరియు ఎప్పటికప్పుడు  విశ్లేషించడం ద్వారా అద్భుతమైన ఫలితాలను నమోదు చేయగలుగుతున్నామని చెప్పారు. ఇప్పటివరకు హన్మకొండలో నయీమ్ నగర్, గోపాల్పూర్, భీమారం పోచమ్మ మైదాన్ లో బ్రాంచ్ లు ఉన్నాయని నేడు కొత్తగా 6వ శాఖను భీమారంలో ప్రారంభించడం జరిగిందని తెలియజేశారు.తల్లిదండ్రులు యొక్క సహకారంతో మరియు అహర్నిశల కృషి చేస్తున్న సిబ్బందితో అత్యుత్తమ విజయాలను సాధిస్తున్నామని వ్యక్తం చేస్తూ విద్యార్థులందరూ సమయాన్ని వృధా చేయకుండా ఘనవిజయాల వైపు పయనించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో వివిధ బ్రాంచీల ప్రిన్సిపాల్స్,  విద్యాసంస్థల సిబ్బంది, తల్లిదండ్రులు మరియు శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. 

Tags: