బాపూజీకి నివాళులు అర్పించిన నల్గొండ ఎంపీ
On
విశ్వంభర , హైద్రాబాద్ : స్వాతంత్ర సమరయోధులు, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పరితపించిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి సందర్భంగా గాంధీ భవన్ లో నల్గొండ పార్లమెంట్ సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సేవాదళ్ సెక్రటరీ కోదుమూరి దయాకర్ రావు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బెస్ట్ సేవ సొసైటీ వ్యవస్థాపకులు బుక్కా ఈశ్వరయ్య, కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ మహిళా అధ్యక్షురాలు శకుంతలా రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజక వర్గ అధ్యక్షులు పిలక వెంకట్ రమణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.