మహిళా సదస్సుకు తరలిరావాలి

* టీపీటీఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్

మహిళా సదస్సుకు తరలిరావాలి

విశ్వంభర, నెల్లికుదురు: అంతర్జాతీయ మహిళా కార్మిక దినోత్సవం పురస్కరించుకుని టీపీటీఎఫ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రం మహబూబాబాద్ లో ఈనెల 8న నిర్వహించే మహిళా సదస్సుకు అధిక సంఖ్యలో తరలిరావాలని టీపీటీఎఫ్ జిల్లా కార్యదర్శి సంగ శ్రీనివాస్ మహిళల కు పిలుపునిచ్చారు. మండలంలోని నర్సింహుల గూడెం పాఠశాలలో కార్యదర్శి శ్రీనివాస్ అధ్యక్షతన గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..పని గంటలు తగ్గించాలని, కనీస సౌకర్యాలు కల్పించాలని కోరుతూ 1857 మార్చి 8న జరిగిన పోరాటంలో మహిళల స్ఫూర్తిని విజయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
 సమాజంలో సగభాగమైన మహిళలకు ప్రభుత్వం సమాన అవకాశాలు కల్పించాలని కోరారు. సమావేశంలో కె.పద్మావతి, హరనాథ్, మమత పాల్గొన్నారు.

Tags: