వైశ్య రాజకీయ రణభేరి ని విజయవంతం చేద్దాం: మొరిశెట్టి సంతోష్ కుమార్ గుప్తా.

ఇప్పుడు కాకుంటే .. ఇక ఎప్పుడు కాదు .. మన హక్కుల కోసం సిద్ధం కండి.. డా . కాచం

వైశ్య రాజకీయ రణభేరి ని విజయవంతం చేద్దాం: మొరిశెట్టి సంతోష్ కుమార్ గుప్తా.

విశ్వంభర, ఎల్బీనగర్ : ఆగస్టు మూడో తేదీన హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో వైశ్య వికాస వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు డా.  కాచం సత్యనారాయణ గుప్త ఆధ్వర్యంలో నిర్వహించే వైశ్య రాజకీయ రణభేరి కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని మనసురాబాద్ డివిజన్ బిజెపి సీనియర్ నాయకులు, ఆర్యవైశ్య సంఘం నాయకులు మొరీశెట్టి సంతోష్ గుప్త పిలుపునిచ్చారు. సోమవారం మనసురాబాద్ డివిజన్లోని చిత్రపురి కాలనీ లో వైశ్య రాజకీయ రణభేరి పోస్టర్  ఆవిష్కరించి సన్నాక సమావేశాన్ని నిర్వహించారు. వారు మాట్లాడుతూ జనాభా దామాషా ప్రకారం  స్థానిక సంస్థల్లో వైశ్యుల వాటా తేల్చాలన్నారు. ఈ డబ్ల్యూ ఎస్ లో వర్గీకరణ తేవాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే నామినేటెడ్ పదవుల్లో వైశ్యులకు తగిన ప్రాధాన్యత కల్పించాలి అని అన్నారు.ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా మహా సభ రాజకీయ కమిటీ ఛైర్మన్ కొత్త రవి గుప్త, పశుపతి గుప్త, మల్లికార్జున రావు, అంజి బాబు, వెంకటాద్రి, లింగమయ్య, బండారి అశోక్, యాదగిరి, కర్ణాకర్, పరమేష్, వంగ వీటి శ్రీనివాస్, వెంపటి గోపి, పవన్, వీర్లపాటి శ్రీనివాస్, వెంకటేష్ , వెంకట రమణ, వెంకటేశ్వర్లు, సతీష్ కుమార్, నాగేంద్ర, నరసింహ, పూర్ణచందర్రావు , ఫణి తదితరులు పాల్గొన్నారు.

Tags: