గీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవి కుమార్ ను పరామర్శించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత  

 - తెలంగాణ భవన్ లో ప్రమాదవశాత్తు జారిపడడంతో విరిగిన  కాలు

గీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవి కుమార్ ను పరామర్శించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత  

విశ్వంభర, హైదరాబాద్ : బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు , తెలంగాణ కల్లు  గీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవి కుమార్ తెలంగాణ భవన్ లో మంగళవారం  ప్రమాదవశాత్తు జారీ పడడంతో కాలు కు తీవ్ర గాయమై విరిగింది. హుటాహుటిన ఆసుపత్రికి తరలించి వైద్యులు చికిత్స అందించారు. గాయపడిన పల్లె రవికుమార్ ను ఎల్బీనగర్ లోని ఆయన నివాసంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు , ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరామర్శించారు. వారితో కాసేపు ముచ్చటించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. వీరితో పాటు  ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి , విత్రీ న్యూస్ ఛానల్ ,  విశ్వంభర దిన పత్రిక చైర్మన్ డా. కాచం సత్యనారాయణ , బిఆర్ ఎస్ రాష్ట్ర నాయకురాలు కాచం సుష్మ , హైద్రాబాద్ జిల్లా శిశు మహిళా సంక్షేమ శాఖ మాజీ జిల్లా ఆర్గనైజర్ సుశీల రెడ్డి, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల  ప్రభాకర్ రెడ్డి, బొల్ల శివ శంకర్ నేత , మాజీ కార్పొరేటర్లు జిట్టా రాజ్ శేఖర్ రెడ్డి, జివి సాగర్ రెడ్డి, కొప్పుల విఠల్ రెడ్డి, పలువురు నాయకులు ఆడాల రమేష్, లోకసాని కొండల్ రెడ్డి, మాధవరం నర్సింగ రావు, బోయపల్లి రమేష్ గౌడ్,   రామ్ కోటి , కూర రమేష్, పార్వతి గౌడ్ , నిర్మల తదితరులు పాల్గొన్నారు. 

 
 

Tags:  

Advertisement