నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే మురళీ నాయక్

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే మురళీ నాయక్

విశ్వంభర, మహబూబాబాద్: మహబూబాబాద్ మున్సిపల్ పరిధిలోని రజాలిపేట గ్రామవాస్త్యులు సూరబోయిన వెంకన్న - వెంకటమ్మ కుమారుడు వెంకటనారాయణ - సంధ్య ల వివాహ వేడుకలకు ఎమ్మెల్యే డా.మురళీ నాయక్ ఆయన సతీమణి డా. ఉమా మురళీ నాయక్ గురువారం హాజరై సూర్యచంద్రుల సాక్షిగా సుందర పరిమళ పుష్పవిరాజితమైన వేదికపై మూడుముళ్ళ బంధంతో ఏడడుగుల అనుబంధంతో ఏకమౌతున్న నూతన వధూవరులను అమృతాక్షింతలతో ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, పట్టణ నాయకులు, మాజీ వార్డ్ కౌన్సిలర్లు, గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags: