శ్రీ మార్కండేశ్వర, శ్రీ వెంకటేశ్వర స్వామి వార్లను దర్శించుకున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి
On
విశ్వంభర, చండూర్ : మున్సిపాలిటీ పరిధిలోగల శ్రీ మార్కండేశ్వర, శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్బంగా చివరి రోజు ఆదివారం మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీ మార్కండేయ, వెంకటేశ్వర స్వామి ఆలయ అర్చకులు వేదం మంత్రోచ్ఛారణల నడుమ పండితులు, ఆలయ కమిటీ సభ్యులు స్వాగతం పలికారు. ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మేరకు మునుగోడు నియోజకవర్గం ప్రజలు సుఖ సంతోషాలతో, పాడిపంటలతో, ఐశ్వర్యంతో ఉండాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. పండితులు ఆశీర్వచనాలు అందించి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. వారి వెంట పట్టణ స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు డా. కోడి శ్రీనివాసులు, దోటి వెంకటేష్, అనంత చంద్రశేఖర్, మంచుకొండ సంజయ్ , నల్లగంటి మల్లేశం, సంకోజు బ్రహ్మం, రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.



