పారా అథ్లెటిక్స్ విజేతలను అభినందించిన ఎమ్మెల్యే దేవిరెడ్డి. 

పారా అథ్లెటిక్స్ విజేతలను అభినందించిన ఎమ్మెల్యే దేవిరెడ్డి. 

విశ్వంభర, ఎల్బీనగర్ : రెండవ తెలంగాణ రాష్ట్ర పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ 2025 విజయవంతంగా ముగిసింది.తెలంగాణ రాష్ట్ర పారా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 2వ రాష్ట్ర స్థాయి పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ 2025 ఆగస్ట్ 6వ తేదీన గచ్చిబౌలి అథ్లెటిక్స్ స్టేడియంలో ఘనంగా ముగిసింది.జూనియర్ మరియు సబ్-జూనియర్ విభాగాల్లో రాష్ట్రం నలుమూలల నుండి వచ్చిన 200కి పైగా అథ్లెట్లు ఈ పోటీల్లో పాల్గొన్నారు.రంగారెడ్డి జిల్లా నుండి ప్రాతినిథ్యం వాహించిన దివ్య,శిరీష మరియు ధనావత్ యశ్వంత్ పతకాల పంట సాధించారు.దివ్య T47 క్యాటగిరి 100 మీటర్ పరుగు,200 మీటర్ పరుగు స్వర్ణ పతకం సాధించింది.శిరీష F40 క్యాటగిరిలో షార్ట్ పుట్ మరియు జావలిన్ విభాగంలో స్వర్ణ పతకం నెగ్గింది.  ధనావత్ యశ్వంత్ 400 మీటర్ మరియు లాంగ్ జంప్ విభాగంలో స్వర్ణ పతకంలో మెరిశాడు.వీరందరిని ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఘనంగా సన్మానించారు. వీరు ముగ్గురు హయత్ నగర్ సాయి చైతన్య మోడల్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నారు. వీరికి సాయి చైతన్య స్కూల్ ఉచిత విద్య అందిస్తుంది. అకాడమీ ఆఫ్ స్పోర్ట్స్ లో శిక్షణ పొందుతున్న వీరు ఈనెల 29 నుండి 31 తేదీ వరకు మధ్యప్రదేశ్ లో నిర్వహిస్తున్న పారా నేషనల్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ 2025 అర్హత సాధించారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి గారు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో మన రాష్ట్రం,దేశం గర్వించదగ్గ మంచి,మంచి పతకాలు సాధించాలి అని అన్నారు. నా యొక్క మద్దతు ఎప్పుడు ఉంటుందని తెలిపారు. కోచ్ వినోద్ కుమార్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో నాయకులు బానోత్ దేవరం నాయక్,పల్లం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Tags: