"తప్పులు మీరు చేసి మమ్మల్ని బద్నాం చేస్తారా?"
బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్‌పై మండిపడ్డ మంత్రి అడ్లూరి లక్ష్మణ్
విశ్వంభర,జగిత్యాల : జగిత్యాల కేంద్రంలో ఏర్పాటైన మెడికల్ కాలేజీ గెస్ట్ హౌస్‌లో బుధవారం రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బిఆర్ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు.తప్పులు మీరు చేసి మమ్మల్ని బదునాం చేస్తారా?" అంటూ మంత్రి ప్రశ్నించారు. విద్యార్థుల సమస్యలపై ఎప్పుడైనా ఆర్‌ఎస్ ప్రవీణ్ స్పందించారా? అని ఆయన నిలదీశారు. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రవీణ్ ఏం చేశారో అందరికీ తెలుసని మంత్రి వ్యాఖ్యానించారు. బిఎస్పీ నేతగా ఉన్నప్పుడు కేసీఆర్ గురించి ఏం మాట్లాడవో వీడియోలు బయట పెట్టమంటావా?" అంటూ హెచ్చరించారు. జీవో 17 గురించి కూడా ప్రవీణ్‌కు సరైన అవగాహన లేదని విమర్శించారు. కోడిగుడ్ల కొనుగోలు వ్యవహారంలో 600 కోట్ల అవినీతి జరిగింది అనే ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్ననని , అడ్డగోలుగా ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు . దోచుకోవడం మీకు అలవాటు, మాకు కాదు అంటూ ఆయన మండిపడ్డారు.ఈ సమావేశంలో ఎమ్మెల్లే సంజయ్ కుమార్ , జిల్లా పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.



