మంత్రి అడ్లూరి ని సన్మానించి, శుభాకాంక్షలు తెలిపిన మైనార్టీ నాయకులు.
On
విశ్వంభర, హైద్రాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ ను శుక్రవారం రోజున ఆయన నివాసంలో పెద్ద పెల్లి కి చెందిన మైనార్టీ నాయకులు మీర్జా అహ్మద్ బేగ్, మీర్జా మోహిద్ బేగ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, కాంగ్రెస్ నాయకులు మమ్మద్ ఖాజా ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మంత్రి దృష్టికి తెలంగాణలోని మైనార్టీల అభ్యున్నతికి, విద్య, యువత నైపుణ్యానికి సహకరించాలని, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మైనార్టీ గురుకులాల పాఠశాలలో మెరుగైన సదుపాయాలను కల్పించాలని కోరారు. అనంతరం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఈ విషయాలపై సానుకూలంగా స్పందించి తప్పకుండా మైనార్టీల సమస్యలపై ప్రభుత్వంతో చర్చించి వారికి తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలను అమలు అయ్యేలా కృషి చేస్తానని, మైనార్టీ గురుకుల పాఠశాలల అభివృద్ధికి తోడ్పాటును అందిస్తానని తెలిపారు.



