ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్‌కార్డులపై మంత్రి కీలక వ్యాఖ్యలు..!

ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్‌కార్డులపై మంత్రి కీలక వ్యాఖ్యలు..!

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులపై కీలక వ్యాఖ్యలు చేశారు. పాలేరు నియోజకవర్గంలో ‘ప్రజలవద్దకే మంత్రి’ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులపై కీలక వ్యాఖ్యలు చేశారు. పాలేరు నియోజకవర్గంలో ‘ప్రజలవద్దకే మంత్రి’ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇళ్లు లేని ప్రతీ ఇక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని స్పష్టం చేశారు. అదేవిధంగా అందరికీ కొత్త రేషన్ కార్డులు, పెంచిన పింఛన్లు అందజేస్తామని హామీ ఇచ్చారు. 

 నియంతృత్వ పాలన నుంచి మార్పు కావాలనే ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నామని మంత్రి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు. గ్రామాల్లో పాఠశాల, రోడ్లు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలను త్వరలోనే పూర్తి చేయిస్తామన్నారు. పాలేరు నియోజకవర్గం తన సొంత ఇల్లు అని, ఎన్నికల కోడ్ పూర్తవగానే నియోజకవర్గంలో అభివృద్ధి పనులు మొదలుపెడతామన్నారు. 

Read More బాపూజీకి నివాళులు అర్పించిన నల్గొండ ఎంపీ 

ప్రజల సమస్యలను తీర్చడం తమ ప్రభుత్వ బాధ్యత అని మంత్రి అన్నారు. ప్రజలు అడిగిన వాటితో పాటు అడగని వాటినీ ఇస్తామన్నారు. భవిష్యత్తులో ఏ సమస్య వచ్చినా ఇందిరమ్మ కమిటీల ద్వారా తనకు తెలియజేయాలని సూచించారు. ప్రజలందరూ సంతోషంగా ఉండటానికి పెద్దకొడుకులా పనిచేస్తానని మంత్రి పొంగులేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు.