మైనార్టీల అభ్యున్నతికి కృషి చేస్తా- మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి. 

మైనార్టీల అభ్యున్నతికి కృషి చేస్తా-  మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి. 

విశ్వంభర, పెద్దపల్లి : తెలంగాణ రాష్ట్రంలో మైనార్టీల అభ్యున్నతికి కృషి చేస్తానని తెలంగాణ కార్మిక, మైనింగ్ శాఖామంత్రి వివేక్ వెంకట స్వామి అన్నారు. మంగళవారం పెద్దపల్లికి చెందిన మైనారిటీ నాయకులు మీర్జా అహ్మద్ భేగ్ ఆధ్వర్యంలో మంత్రిని కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మీర్జా అహ్మద్ బేగ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మైనారిటీల కోసం ప్రవేశపెట్టే పథకాలను రాష్ట్రంలోని మైనార్టీ లందరికీ అందేటట్టు చూడాలని, రాబోయే అన్ని సంక్షేమ పథకాలతోపాటు ముస్లిం యువతకు నైపుణ్యాభివృద్ధి, విద్యకు ఆర్థిక సాధికారత అవసరమని దానికి తమ వంతు కృషి చేయాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. దీనికి మంత్రి డాక్టర్ వివేక్ సానుకూలంగా స్పందించి, మైనార్టీల సమస్య లపై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి సాధ్యమైనంత వరకు సమస్యలను పరిష్కరిస్తనని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మీర్జా జావిద్ బేగ్, మీర్జా సాజిద్ బేగ్, మీర్జా మొహిద్ బేగ్ తదితరులు పాల్గొన్నారు.

Tags: