ఈ నెల 27 న మెగా రక్తదాన శిబిరం 

ఈ నెల 27 న మెగా రక్తదాన శిబిరం 

విశ్వంభర, ఎల్బీనగర్ : జులై 27 ఆదివారం నాడు ఎల్బీనగర్ ఎమ్మెల్యే  దేవి రెడ్డి సుధీర్ రెడ్డి జన్మదిన సందర్బంగా మదర్ థెరిస్సా చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో తలసీమియా రోగుల కోసం మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించనున్నట్లు చారిటబుల్ నిర్వాహకులు చేపూరి శంకర్ పత్రిక ప్రకటనలో తెలిపారు. భారతదేశంలో తల సేమియా బాధితులు రోజుకు 12 వేల మంది  చనిపోతున్నారు అని వారిని నివారించడానికి మేము నిరంతరం క్యాంపులు ఏర్పాటు చేస్తున్నాం అని అన్నారు. అభిమానులు, పార్టీ కార్యకర్తలు, మహిళలు సామాజిక కార్యకర్తలు, కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, కార్యదర్శులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా  పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని సామాజిక కార్యకర్త మదర్ థెరిస్సా చారిటబుల్ సొసైటీ అధ్యక్షులు  చేపూరి శంకర్ కోరారు.

Tags: