సీఎం రేవంత్ తో మూడు పార్టీల నేతల భేటీ
On
విశ్వంభర, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సీపీఐ, సీపీఎం, తెలంగాణ జన సమితి నేతలు భేటీ అయ్యారు. శనివారం హైదరాబాద్ లోని సీఎం నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశానికి ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ విశ్వేశ్వర్ రావు, ఎమ్మెల్యే కూనంలేని సాంబశివరావు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, ఎస్. వీరయ్య, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, మల్లు రవి, సీఎం సలహాదారు వే నరేందర్ రెడ్డి, బొంతు రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.