ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలి: మధు యాష్కీ గౌడ్.

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలి: మధు యాష్కీ గౌడ్.

విశ్వంభర, ఎల్బీనగర్ : పేద ప్రజల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని గడ్డి అన్నారం డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ సునీల్ బాబు, గడ్డిఅన్నారం డివిజన్ అధ్యక్షులు బద్దుల వేణు గోపాల్ యాదవ్ లకు టీపీసీసీ క్యాంపెనింగ్ కమిటీ చైర్మన్,  మాజీ ఎంపీ,  ఎల్బీనగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ మధు యాష్కీ గౌడ్ సూచించారు. గురువారం 
క్యాంప్ ఆఫీస్ లో వారు   మర్యాదపూర్వకంగా కలిశారు . ఈ సందర్భంగా మధుయాష్కి మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అయిన 6 గ్యారెంటీలను కాంగ్రెస్ పార్టీ అమలు చేసి చూపిందని అన్నారు. ఈ కార్యక్రమంలో 
 నాయకులు  విజయ్ , కృష్ణారెడ్డి , మల్లేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Tags: