సడక్ తాండకు బోరు మోటరు అందజేసిన లయన్స్ క్లబ్
విశ్వంభర, ఆమనగల్లు: లయన్స్ క్లబ్ ఆఫ్ ఆమనగల్లు పలు సామాజిక సేవా కార్యక్రమాలలో ముందుంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక అవసరాలను గుర్తించి లయన్స్ క్లబ్ సభ్యులు అండగా అండగా నిలుస్తూ కావాల్సిన మౌలిక అవసరాలను తీరుస్తున్నారు. సోమవారం లయన్స్ క్లబ్ ఆఫ్ ఆమనగల్ వారి ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ సభ్యులు దోమ మోహన్ రెడ్డి సహకారంతో రూ, 30 వేల విలువగల బోరు మోటర్ ను క్లబ్ అధ్యక్షులు పసుల లక్ష్మారెడ్డి ప్రారంభింపజేశారు. వేసవికాలం సమీపిస్తున్న దృశ్య తలకొండపల్లి మండలంలోని సడక్ తాండ గిరిజనులు నీటి ఎద్దడి ఏర్పడి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నీటి ఎద్దడి నివారణ కోసం లయన్స్ సభ్యులు దోమ మోహన్ రెడ్డి స్పందించి బోరు మోటర్ ను ఇప్పించి నీటి ఎద్దడి తీర్చిన లయన్ సభ్యులు మోహన్ రెడ్డికి క్లబ్ అధ్యక్షులు పసుల లక్ష్మారెడ్డి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చేపట్టే సేవా కార్యక్రమాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని అధ్యక్షుడు లక్ష్మారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ కండే ఓంకారం, లయన్ మధుసూదన్ రెడ్డి, లయన్స్ క్లబ్ పి ఆర్ ఓ ఎంఏ పాషా, తండావాసులు దేవుళ నాయక్, దేశ్యా నాయక్ తదితరులు పాల్గొన్నారు.



