ఎంపీ వద్దిరాజును కలిసిన LHPS నాయకులు
విశ్వంభర, హైద్రాబాద్ : బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రను లంబాడీ హక్కుల పోరాట సమితి (ఏల్ఏచ్పీఏస్) నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. ఏల్ఏచ్పీఏస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ నాయక్, ఖమ్మం జిల్లా శాఖ అధ్యక్షుడు దశరథ్ నాయక్ ల ఆధ్వర్యాన పలువురు నాయకులు ఎంపీ రవిచంద్రను శుక్రవారం హైదరాబాద్ బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని క్యాంప్ కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు.గోర్ బోలి భాషను అధికారికంగా గుర్తిస్తూ రాజ్యాంగంలో పొందుపర్చాలని, గిరిజనులు సాగు చేస్తున్న పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, గిరిజనుల సర్వతోముఖాభివృద్ధికి మైదాన ప్రాంతాలలో ఐటీడీఏలను నెలకొల్పాలని కోరుతూ ఎంపీ రవిచంద్రకు వినతిపత్రం సమర్పించారు. ఈవిధంగా తమ న్యాయమైన హక్కుల సాధనకు సంపూర్ణ మద్దతునివ్వాల్సిందిగా ఎంపీ వద్దిరాజుకు వారు విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా రాజేష్, దశరథ్ నాయక్ ల వెంట ఏల్ఏచ్పీఏస్ నాయకులు శివాజీ నాయక్,నందూ నాయక్, గణేష్ నాయక్,లాలునాయక్ తదితరులు ఉన్నారు.