అంబేడ్కర్ కలలుగన్న సమసమాజాన్ని సాధించుకుందాం - ఎర్ర వెంకటయ్య

 అంబేడ్కర్ కలలుగన్న సమసమాజాన్ని సాధించుకుందాం - ఎర్ర వెంకటయ్య

విశ్వంభర, చింతపల్లి: ఆధునిక భారత సమాజ నిర్మాణానికి పునాదులు వేసిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సేవలను ఆయన జయంతి సందర్భంగా స్మరించుకొని, ఆయన కలలుగన్న సమాజాన్ని సాధించుకుందామని అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు ఎర్ర వెంకటయ్య పిలుపునిచ్చారు.సోమవారం చింతపల్లి మండల కేంద్రంలో ఆయన ఆధ్వర్యంలో అంబేద్కర్ 134వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తోలుత అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. జై భీమ్ నినాదాలతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఎప్పుడూ అప్రమత్తులై, విద్యావంతులై ఆత్మగౌరవంతో, ఆత్మ విశ్వాసంతో ఉన్నప్పుడే ఆ జాతి బాగుపడుతుందని అంబేద్కర్ అన్నారని స్మరించుకున్నారు. ఆ మహాశయుని వాక్కు స్ఫూర్తిగా బడుగు వర్గాల ఆత్మగౌరవాన్ని నిలపడానికి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి అంకితభావంతో మనందరం కృషిచేద్దామని పిలుపునిచ్చారు. అంబేద్కర్ కలలుగన్న సమసమాజాన్ని సాధించుకుందామని ఉద్ఘాటించారు. భారత రాజ్యాంగ నిర్మాతగా, స్వంతంత్ర భారత తొలి న్యాయశాఖ మంత్రిగా , స్వాతంత్రోద్యమ వీరుడిగా... ఆధునిక భారత సమాజ నిర్మాణానికి పునాదులు వేశారని గుర్తుచేసుకున్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహానుభావుని దేశసేవను స్మరించుకుందామని తెలిపారు. దళిత అభ్యుదయానికి అందరం పునరంకితమవుదామని ఉద్ఘాటించారు. దేశానికి ఆయన అందించిన సేవలు నిరుపమానమని గుర్తుచేసుకున్నారు. అసమానతలు లేని సమాజం కోసం ఆయన అనునిత్యం పరితపించారని స్మరించుకున్నారు.  అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరం కృషి చేద్దామని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమం లో టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కంకణాల వెంకట్ రెడ్డి, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు కృష్ణ మాదిగ,ఎర్ర జగన్, ప్రొఫెసర్ చెట్టిపల్లి మల్లికార్జున్, చెన్నయ్య,అరేకంటి యాదయ్య, ఎలిమినేటి నరసింహ,మాసని పెద్దయ్య, ప్రజా గాయకుడు ఆరేకంటి జగన్, సత్యనారాయణ,మైనార్టీ సభ్యులు సలీం,గౌస్, ముషావర్, గంటెల ఆంజనేయులు, డవలయ్య, అరేకంటి జంగయ్య, అరేకంటి రామకృష్ణ, రాదా కృష్ణ, ఎమ్మార్పీఎస్ నాయకులు, వివిధ సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు

Tags: