భూసేకరణ త్వరగా పూర్తి చేయాలి
On
- జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
విశ్వంభర,సూర్యాపేట: సూర్యాపేట జిల్లాలో నిర్మించతలపెట్టిన వివిధ ప్రాజెక్టులకు కావలసిన భూ సేకరణ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. శనివారం కలెక్టర్ సమావేశ మందిరంలో ఆర్డీవోలు, తాసిల్దార్లు, ఆర్ అండ్ బి, ఇరిగేషన్, టీజీ ఐఐసి, రైల్వే శాఖ, పంచాయతీరాజ్ అధికారులతో భూ సేకరణ పనుల పై కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇరిగేషన్ ప్రాజెక్టులు, రైల్వే ప్రాజెక్టులు, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులు మరియు వివిధ అభివృద్ధి పనులకు అవసరమైన భూ సేకరణ, పెండింగ్ లో ఉన్న భూసేకరణ పనులు నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కె. సీతారామారావు, సూర్యాపేట ఆర్డీవో వేణుమాధవ్, సూపర్డెంట్ శ్రీలత తదితరులు పాల్గొన్నారు.



