ఓయూ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు
విశ్వంభర, హైద్రాబాద్ : బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పుట్టినరోజు సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో నిర్వహించిన జన్మదిన వేడుకలకు ముఖ్య అతిథిగా తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు డా.గాదరి కిశోర్ కుమార్ హాజరై ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో కేక్ కట్ చేసి, విద్యార్థులకు పుస్తకాలు, గొడుగులు పంపిణీ చేసి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లాంగ్ లీవ్ కేటిఆర్ అంటూ నినాదాలు చేస్తూ కేటీఆర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ వై , బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ జంగం అవినాశ్ పాల్గొన్నారు. డాక్టర్ జంగం అవినాష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని కాపాడే క్రమంలో భగవంతుడు వారికి మనోధైర్యాన్ని ఆశీస్సులు అందించి ముందుకు నడిపించాలని రాబోయే రోజులు మళ్లీ తెలంగాణ మంత్రిగా బాధ్యతలు చేపట్టి తెలంగాణను మరింత అభివృద్ధి చేయాలని కోరుకున్నారు.



