లండన్ లో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

లండన్ లో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

విశ్వంభర, లండన్: ఎన్నారై బీఆర్ఎస్ యూకే ఆధ్వర్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రివర్యులు కేటీఆర్ జన్మదిన వేడుకలు లండన్‌లో ఘనంగా నిర్వహించారు. ఎన్నారై బీఆర్ఎస్ యూకే ఉపాధ్యక్షులు హరి గౌడ్ నవాపేట్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో యూకే నలుమూలల నుండి కేటీఆర్ అభిమానులు పాల్గొని కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ సందర్భంగా రామన్న అభిమానులు అందరు జై రామన్న, హ్యాపీ బర్త్డే రామన్న, లాంగ్ లివ్ రామన్న అనే నినాదాలతో వేదికను మారుమోగించారు. ఈ సందర్భంగా ఎన్నారై బీఆర్‌ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి మాట్లాడుతూ కేటీఆర్ ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని, తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని కాపాడే  క్రమంలో భగవంతుడు వారికి అన్ని సందర్భాల్లో మనోధైర్యాన్ని , ఆశీస్సులు అందించి ముందుకు నడిపించాలని, రాబోయే రోజుల్లో మళ్ళీ తెలంగాణకు మంత్రిగా బాధ్యతలు చేపట్టి తెలంగాణను మరింత అభివృద్ధి చెయ్యాలని కోరుకున్నారు. ఎన్నారై బీఆర్ఎస్ యూకే ఉపాధ్యక్షుడు సత్యమూర్తి చిలుముల మాట్లాడుతూ ఎలాగైతే ఉద్యమ సమయం నుండి నేటి వరకు వారి వెంట ఉన్నామో, భవిష్యత్తులో కూడా వారి వెంటే ఉంటామనీ, అన్ని సందర్భాల్లో మా వెంటే ఉంటూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి మరియు ఇతర నాయకులందరికి కృతఙ్ఞతలు తెలిపారు. ఎన్నారై బీఆర్ఎస్ యూకే ఉపాధ్యక్షుడు రవి కుమార్ రేటినేని మాట్లాడుతూ కేటీఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ప్రభుత్వమైనా, ప్రతిపక్షమైన క్రమశిక్షణ కలిగిన క్రియాశీలక కార్యకర్తలుగా పార్టీకి ఎల్లపుడూ అండగా ఉంటూ కేటీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తూ రాబోయే రోజుల్లో పార్టీ పిలుపిచ్చిన అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు నవీన్ రెడ్డి, ఉపాధ్యక్షులు హరి గౌడ్ నవాపేట్, సత్యమూర్తి చిలుముల, రవి కుమార్ రేటినేని, మాజీ అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి, జనరల్ సెక్రటరీ రత్నాకర్ కడుదుల, అడ్వైసరీ బోర్డు వైస్ చైర్మన్  గణేష్ కుప్పాల , శ్రీకాంత్ జెల్ల, కార్యదర్శి - ఐటీ, మీడియా & పీఆర్ రవి ప్రదీప్ పులుసు, కార్యదర్శులు మల్లా రెడ్డి, అబూ జాఫర్, కోశాధికారి సురేష్ బుడగం,  లండన్ ఇంచార్జ్ సత్యపాల్ రెడ్డి పింగలి, సంయుక్త కార్యదర్శి రామకృష్ణ కలకుంట్ల మరియు ముఖ్య సభ్యులు ప్రశాంత్, అజయ్, అంజన్, తరుణ్ లూనావత్, పవన్ కుమార్ గౌడ్ వున్నారు.

Tags: