కొండా సురేఖ క్రిమినల్ చర్యలకు అర్హురాలు:నాగార్జున తరఫు న్యాయవాది

కొండా సురేఖ క్రిమినల్ చర్యలకు అర్హురాలు:నాగార్జున తరఫు న్యాయవాది

కొండా సురేఖ క్రిమినల్ చర్యలకు అర్హురాలు

విశ్వంభ‌ర‌, హైదరాబాద్‌:  మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్య‌ల‌పై సినీనటుడు నాగార్జున వేసిన పరువు నష్టం దావాపై నాంపల్లి కోర్టులో గురువారం వాదనలు జరిగాయి.  ఈ కేసులో కౌంటర్‌ను కొండా సురేఖ తరఫు న్యాయవాది గురుప్రీత్ సింగ్ దాఖలు చేశారు. నాగార్జున తరఫు న్యాయవాది అశోక్ రెడ్డి వాదనలు వినిపించారు. ఇప్పటికే నాగార్జున, ఆయన కుటుంబ సభ్యుల వాంగ్మూలాన్ని కోర్టు నమోదు చేసింది.

వాదనల సందర్భంగా నాగార్జున తరఫు న్యాయవాది అశోక్ రెడ్డి మాట్లాడుతూ.. నాగార్జునపై కొండా సురేఖ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్నారు. ఆ తర్వాత ‘ఎక్స్‌’లో క్షమాపణ కోరుతూ పోస్ట్ పెట్టారన్నారు. ఎక్స్‌లో మంత్రి కొండా సురేఖ పెట్టిన పోస్టును ఆయన కోర్టు ముందు చదివి వినిపించారు. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని అశోక్‌రెడ్డి అన్నారు. కచ్చితంగా కొండా సురేఖ క్రిమినల్ చర్యలకు అర్హురాలు అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యల వల్ల నాగార్జున కుటుంబం మానసికంగా ఎంతో కుంగిపోయిందని చెప్పారు.

Read More జిల్లా వ్యాప్తంగా నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు:జిల్లాఎస్ పీ  రూపేష్

Tags: