సమాజంలో హీరో లే కాదు శీరోస్ కూడా ఉన్నారు : బండ్రు శోభారాణి

సమాజంలో హీరో లే కాదు శీరోస్  కూడా ఉన్నారు : బండ్రు శోభారాణి

విశ్వంభర, హైదరాబాదు: అంతర్జాతీయ  మహిళా దినోత్సవం ను పురస్కరించుకొని  తెలంగాణ బాలోత్సవం ఆధ్వర్యం లో  శనివారం ఉదయం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శ్రామిక మహిళా దినోత్సవం పేరిట ధీరవనితోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ మహిళా కొ ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి మాట్లాడుతూ ఈ సమాజంలో హీరో లే కాదు శీరోస్  కూడా ఉన్నారని "పురుషులు స్త్రీలు సమానమే" నని ధీర వనితలు మా కాదర్షం అంటూ చీకటి నుంచి వెలుగులోకి ఆడపిల్లలంటే ఆడ పులులు అని తోటి మహిళలకు వెలుగులు నింపుతూ ఎదైనా సాధించగలిగే మనోబలం పెంచిందని అన్నారు షీరోస్ కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని ఆడ పిల్లల్లో ఆత్మస్థైర్యం పెంచుతున్నదని అన్నారు మహారాజులు కాదు మహా రాణులున్నారని సామాజిక, సనాతన సాంప్రదాయ కట్టుబాట్ల సంకెళ్లు బద్దలు కొట్టండి ధైర్యాన్ని అందించారు 
తెలంగాణ రాష్ట్రం లో జాతీయ బాలిక దీనోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు డాక్టర్ నళిని మాట్లాడుతూ మహిళా బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టి 28 సంవత్సరాలు పూర్తయిన ఎందుకు అమలు చేయట్లేదని ప్రశ్నించారు ఏకాభిప్రాయం పేరుతో బిల్లు ను అపుతున్నారని అన్నారు హక్కులు ఎవ్వరి దయ తో రావని మహిళా శక్తి చాటితేనే వస్తాయని అన్నారు 
ఈ కార్యక్రమం తెలంగాణ బాలోత్సవం కమిటీ సభ్యులు అంకమ్మ గారు అధ్యక్షతన జరిగింది తెలంగాణ బాలోత్సవం ఉపాధ్యక్షురాలు కే సుజావతి మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని అన్ని జిల్లాల్లో నిర్వహిస్తామని చెప్పారు తెలంగాణ బాలోత్సవం అద్యక్షుడు భూపతి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ..
పురుషుడే కత్తి పట్టాలి కలం పట్టాలి రాజ్యమేలాలి రాజవ్యాలి అన్న దురాగతాలను ఎదిరించిన బెలవాడ మల్లమ్మ, రాణి రుద్రమదేవి రాణి శంకరమ్మ లాంటి తదితరుల సాహసాలు పునికి పుచ్చుకోవాలి సావిత్రిబాయి పూలే మల్లు స్వరాజ్యం చిందు ఎల్లమ్మ లాంటి ధీర వనితలు- స్పూర్తికాంతుల స్పూర్తి తో సాగాలని ప్రబోధించారు 
తెలంగాణ బాలోత్సవం కార్యదర్శి ఎన్ సోమయ్య,జి బుచ్చిరెడ్డి ఇ.మమత నృత్య గురువులు మాఢభూషిణి రమణి సిద్ది, ఇందిరా పరాశరం, రాజేశ్వరి మాదవి శర్మ, చూడామణి తదితరులు పాల్గొన్నారు మహిళా ఉపాధ్యాయులు నృత్య గురువులు రక రకాల ధీరవనితల వేషాలలో అభినయించారు పలువురిని ఆకట్టుకున్నాయి సమాన హక్కు*లఘు నాటిక ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రవాసభారతీయులు శివరామకృష్ణ జాస్తి గారు పంపిన*షీరోస్ పుస్తకాలు సర్టిఫికెట్ అందజేశారు.

Tags: