వందలాది కుక్కల చంపడం అమానవీయం

నిజామాబాద్ జిల్లాలో కుక్కల సంహారంపై రేణూ దేశాయ్ ఆగ్రహం 

వందలాది కుక్కల చంపడం అమానవీయం

వీధి కుక్కల సమస్యపై నటి రేణూ దేశాయ్, యాంకర్ రష్మీ గౌతమ్ తీవ్రంగా స్పందించారు. ఇటీవల నిజామాబాద్ జిల్లాలో వందలాది కుక్కలను సామూహికంగా చంపడాన్ని వారు తీవ్రంగా ఖండించారు.
 

 

విశ్వంభర, తెలంగాణ బ్యూరో: వీధి కుక్కల సమస్యపై నటి రేణూ దేశాయ్, యాంకర్ రష్మీ గౌతమ్ తీవ్రంగా స్పందించారు. ఇటీవల నిజామాబాద్ జిల్లాలో వందలాది కుక్కలను సామూహికంగా చంపడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో రేణూ దేశాయ్ ఉద్వేగంగా మాట్లాడుతూ వ్యవస్థలోని లోపాలను ఎండగట్టారు. "కుక్క కాటు వల్ల ఒకరు చనిపోతే స్పందించే వ్యవస్థలు.. రోడ్డు ప్రమాదాలు, అత్యాచారాలు, హత్యలు జరిగినప్పుడు ఎందుకు మౌనంగా ఉంటున్నాయి?" అని ఆమె ప్రశ్నించారు. సమాజంలో చిన్నారులపై అకృత్యాలు జరిగినప్పుడు స్పందించని వారు, ఒక కుక్క కరిచిందని వందలాది మూగజీవాలను చంపడం అమానవీయమని మండిపడ్డారు.
 
కర్మ ఎవరినీ వదలదు..
మనుషులకే కాదు.. ఆవు, గేదె, పిల్లి, కోతి వంటి అన్ని ప్రాణులకు జీవించే హక్కు ఉందని.. పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటం, చెత్త పేరుకుపోవడం వల్లే వీధి కుక్కల సంఖ్య పెరుగుతోందని.. దీన్ని వదిలేసి కుక్కలను చంపడమేంటని ఆమె నిలదీశారు. "2019లో నాకు డెంగీ వస్తే చనిపోయినంత పని అయింది. మరి ప్రభుత్వం దోమల నివారణకు ఏం చేసింది? లక్షల మందిని బలి తీసుకుంటున్న దోమల విషయంలో ఎందుకు ఇలాంటి చర్యలు తీసుకోవడం లేదు?" అని ప్రశ్నించారు. ఉదయం లేవగానే కాలభైరవుడిని (కుక్క వాహనం) పూజిస్తూ, బయట కుక్కలను చంపడం విడ్డూరంగా ఉందని, కర్మ ఎవరినీ వదిలిపెట్టదని హెచ్చరించారు.

రాజకీయాల్లోకి రాను..
తనపై వస్తున్న రాజకీయ విమర్శలకు రేణూ స్వస్తి పలికారు. "నాకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం ఏమాత్రం లేదు. ఈ విషయంలో నా వ్యక్తిగత జీవితాన్ని లాగడం సమంజసం కాదు" అని స్పష్టం చేశారు. ప్రెస్ మీట్‌లో ఒక వ్యక్తి తనపై దాడికి ప్రయత్నించినప్పుడే తాను ఆగ్రహం వ్యక్తం చేశానని వివరించారు.

Read More 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌..సీఎం రేవంత్ భారీ సన్నాహాలు !

ప్రభుత్వాలు విఫలమయ్యాయి 
ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం వల్లే కుక్కల సంఖ్య అదుపు తప్పిందని యాంకర్ రష్మీ గౌతమ్ విమర్శించారు. వీధి కుక్కల కోసం ప్రత్యేక షెల్టర్లు ఏర్పాటు చేయాలని, విదేశీ బ్రీడ్స్ పెంచుకునే వారు కూడా బాధ్యతగా ఉండాలని ఆమె సూచించారు.

Related Posts