హైదరాబాద్ పాతబస్తీలో ఉద్యోమేళా - చెవిటి,మూగ ప్రత్యేక ఆకర్షణ
విశ్వంభర, అలియాబాద్ : శారద విద్యాలయం డిగ్రీ , పిజి కళాశాలలో ఉద్యోగ మేళా కార్యక్రమాన్ని హైదరాబాద్ హ్యూమన్ కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ వెల్ఫేర్ వారు మేళా ను చేపట్టారు. కళాశాల యాజమాన్యం మరియు ప్రిన్సిపాల్ సాంబ లలిత ఈ మేళా లో ఉన్నారు. 1000 మందికి పైగా ఈ మేళా లో నిరుద్యోగ యువతి యువకులు పాల్గొన్నారు. 70 కంపెనీలు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ముందుకు రావడం విశేషం , ప్రత్యేక ఆకర్షణ ఈ ఇంటర్వ్యూలకు మూగ, చెవిటి వారు రావటం ఇంటర్వ్యూ కు హాజరవ్వటం అందరిని ఆకర్షించింది. ఫౌండర్ అండ్ డైరెక్టర్ హైదరాబాద్ కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ వెల్ఫేర్ డైరెక్టర్ డాక్టర్ మహమ్మద్ రఫీయుద్దీన్, మాట్లాడుతూ ఇప్పటికే 1,30,000 వీధి బాలలకు 2016 నుండి స్మార్ట్ సెంటర్ ఏర్పాటు చేయడం,1098 హెల్ప్ లైన్ కూడా మొదట మా దగ్గర నుండే ఏర్పాటు చేసామన్నారు. మా దగ్గర చదువుకున్న వీధి బాలలు, ఇప్పుడు మంచి మంచి ఉద్యోగాల్లో ఉన్నారని మాకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. మేము చేసే కార్యక్రమాలకు చేదోడు వాదోడుగా ఉంటున్నారని చెప్పుకొచ్చారు. గత పది సంవత్సరాల నుంచి మెహిదీపట్నంలోసెంటర్ నడుపుతున్నామని తెలిపారు. పెద్ద పెద్ద చదువులు చదివి ఇంటికి పరిమితమైన చాలామంది విద్యార్థిని విద్యార్థులు సంతోషాన్ని వ్యక్తం చేస్తుంటే మాకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో జాబ్ మేళాలు (చెవిటి,మూగ ) వాలు కూడా పాల్గొని ఉద్యోగాలు పొందడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.



