బీసీ కులగణనలో పద్మశాలి జనాభాను తక్కువచేసి చూపించడం దౌర్భాగ్యం - కల్లేపల్లి రాజు నేత
On
విశ్వంభర, హైద్రాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వేలో పద్మశాలి కులాన్ని తక్కువ చేసి చూపించడం దౌర్బాగ్యం అని గ్రేటర్ హైద్రాబాద్ పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి కల్లేపల్లి రాజు నేత ధ్వజమోత్తారు. ఆదివారం వారి కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం నిర్వహించిన ఇంటింటి సర్వేలో బీసీల్లో పద్మశాలి కులస్తులను మూడవ స్థానం ఉండేదని, ఈ ప్రభుత్వం ఐదవ స్థానంలో తీసుకువచ్చిందన్నారు. ఈ ప్రభుత్వం మరోసారి సర్వేను నిర్వహించాలని కోరారు. ఈ సమావేశంలో నరేందర్, గోవింద్, జనార్ధన్, శ్రీధర్ , గ్రేటర్ పద్మశాలి సంఘం నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.