212 వ బెటాలియన్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవం 

212 వ బెటాలియన్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవం 

విశ్వంభర ,భద్రాచలం: కిస్టారాం ప్రాంతంలోని సీఆర్‌పీఎఫ్ 212వ బెటాలియన్ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బటాలియన్ కమాండెంట్  దీపక్ కుమార్ శ్రీవాస్తవ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యోగా మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, మానసిక శాంతిని చేకూర్చుతుందన్నారు. యోగా ద్వారా వ్యక్తిగతంగా మరియు సామూహికంగా మానవ జీవితాన్ని ఆరోగ్యంగా మార్చుకోవచ్చని తెలిపారు. ఈ ఏడాది యోగా దినోత్సవం థీమ్‌ “Yoga for One Earth, One Health”గా ఉన్నట్లు పేర్కొన్నారు. అదే విధంగా మన ఆరోగ్యం, ప్రకృతి మధ్య అనుసంధానాన్ని విశదీకరించారు. బలగ సభ్యులతో పాటు సివిలియన్లు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొనగా, కార్యక్రమం అనంతరం వారికి తలపాగలు, అల్పాహారం వంటి ఏర్పాట్లు నిర్వహించబడ్డాయి. కేంద్ర ఆయుష్ మంత్రిత్వశాఖ అందించిన ప్రత్యేక లింక్ (https://drive.google.com/drive/v/o/folder) ద్వారా ప్రజల భాగస్వామ్యాన్ని పెంచే ప్రయత్నం కూడా సాగుతోంది.ఈ కార్యక్రమంలో ద్వితీయ కమాండింగ్ అధికారులు గజేంద్ర బహదూర్,  దినేష్ కుమార్, ఉప కమాండెంట్  గౌరవ్ శర్మ లతో పాటు ఇతర అధికారి గణం, సిబ్బంది పాల్గొన్నారు. మొత్తం 150 మందికి పైగా సీఆర్‌పీఎఫ్ సిబ్బంది, స్థానికులు, స్కూలు విద్యార్థులు యోగా కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. కేవలం ప్రధాన కార్యాలయంలోనే కాదు, కిస్టారాం అక్సిస్‌లోని 212వ బెటాలియన్‌కు చెందిన అన్ని కంపెనీలలోనూ యోగా దినోత్సవాన్ని సమానంగా జరిపినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా బలగ సభ్యులంతా ఉత్సాహంతో పాల్గొనడం విశేషంగా నిలిచింది.

 

Tags: