ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

విశ్వంభర, కడ్తాల్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం కడ్తాల్ గ్రామపంచాయతీ కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. గ్రామ ప్రత్యేకాధికారి సుజాత నాయక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళా గ్రామ సభలో పాల్గొని మహిళా సాధికారత గురించి, వారి పట్టుదల గురించి, వివిధ రంగాలలో మహిళలు సాధించిన కృషి, విజయాలను గుర్తుచేశారు. ఈ దినోత్సవం ఒక ప్రత్యేక వేదిక అని చెప్పుకోవాలని అన్నారు. స్త్రీ దేవుని అత్యంత శక్తివంతమైన సృష్టి. ఆ సృష్టి వెనుక కూడా ఉన్నది ఒక స్త్రీయే. ఒకప్పుడు సమాజంలో స్త్రీలను చాలా తక్కువగా అంచనా వేసేవారు. పురుషులకంటే బలహీనంగా భావించేవారు. జీవితాన్నిసృష్టించే శక్తి ఉన్న స్త్రీ, పురుషులతో సమానంగా ఏ పనైనా చేయగలదని అన్నారు. ఇప్పుడు వృత్తిపరమైన రంగంలో కూడా మహిళలు ఉన్నతశిఖరాలనుచేరుకుంటున్నారని తెలిపారు. అనంతరం మహిళా గ్రామ సభలో పాల్గొన్న మహిళలను అభినందించారు. మహిళలతో కలిసి కేక్ కట్ చేసివేడుకలునిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ యాట గీతనర్సింహా, మాజీ జడ్పిటిసి సభ్యులు దశరత్ నాయక్, మాజీ సర్పంచ్ లక్మి నర్సింహ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ ఆనంద్, మాజీ ఎంపీటీసీ శ్రీనివాసరెడ్డి,లక్ష్మయ్య, మాజీ ఉపసర్పంచ్ రామకృష్ణ, మాజీ వార్డు సభ్యులు గురిగళ్ళ జంగమ్మ రామచంద్రయ్య, బీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాఘవేందర్, బీసీ మండలాధ్యక్షుడు వెంకటేష్, మాజీ కో ఆప్షన్ జహంగీర్ బాబా, మాజీ మార్కెట్ డైరెక్టర్ లాయక్ అలీ, జహంగీర్ అలీ, ఏఎన్ఎం పుష్ప, అంగన్వాడీలు, ఆశాల, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags: