బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
విశ్వంభర, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాచలం పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద బీఆర్ఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ కార్మికురాలు సుజాత కు బీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు కావూరి సీతా మహాలక్ష్మి, మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ ఏలూరి ప్రియాంక లు శాలువాతో సత్కరించి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల కమిటీ నేతలు మండల పార్టీ కన్వీనర్ ఆకోజు సునీల్ కుమార్, కోకన్వీనర్ రేపాక పూర్ణ చందర్రావు, సీనియర్ నాయకులు కోటగిరి ప్రబోధ్ కుమార్, కొల్లం జయ ప్రేమ్ కుమార్, బత్తుల నరసింహులు, గుంజ ఏడుకొండలు, రాజుదేవర నాగరాజు, అంబటి కర్ర కృష్ణ, కాపుల సూరిబాబు, దానియేలు ప్రదీప్, సతీష్, తన్నీరు సుబ్బారావు, అయినాలా రామకృష్ణ, గోసుల శ్రీనివాసు, కొల్లిపాక శివ, గణేష్, రవి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మహిళల హక్కులు, సాధికారత, సమానత్వం పై నాయకులు ప్రసంగించారు.



