డా.బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో  రాజ్యాంగం రక్షణకై పోరాడుదాం --రాష్ట్ర సమన్వయ ప్రధాన కార్యదర్శి కెవిఎల్ పిలుపు

డా.బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో  రాజ్యాంగం రక్షణకై పోరాడుదాం --రాష్ట్ర సమన్వయ ప్రధాన కార్యదర్శి కెవిఎల్ పిలుపు

విశ్వంభర, హైదరాబాద్ : బ్రిటిష్ సామ్రాజ్యవాదం ఉక్కు పాదాల కింద నలిగిపోతున్న భారత దేశంలో, అసమానతలు, అంటరానితనం ,రాజ్యమేలుతున్న కాలంలో బాల్యం నుండి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చేసినటువంటి పోరాటం అటు తర్వాత స్వాతంత్య్ర  అనంతరం గొప్ప రాజ్యాంగాన్ని అందించి దేశాన్ని ఉన్నతమైన ప్రగతి పదములో ఉంచాలని ప్రజలందరికీ సమాన అవకాశాలు కలగాలని ఆశించిన బాబా సాహెబ్ అంబేద్కర్ పోరాటస్ఫూర్తితో దేశంలోని ప్రతి ఒక్కరు భారత రాజ్యాంగాన్ని ,దేశాన్ని రక్షించుకోవడానికి ముందుకు రావాలని అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం రాష్ట్ర సమన్వయ ప్రధాన కార్యదర్శి కె. వి.ఎల్. పిలుపును ఇచ్చారు
నేడు అఖిలభారత శాంతి సంఘీభావ సంఘం ఆధ్వర్యంలో చైతన్యపురి సెంటర్లో డాక్టర్ కాచం సత్యనారాయణ అధ్యక్షతన 134 అంబేద్కర్ జయంతి నిర్వహించబడినది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర, జిల్లా, నగర , నాయకులు అంబేద్కర్ చిత్రపటానికి పూల మాలలు వేసి జోహార్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమన్వయ ప్రధాన కార్యదర్శి కెవిఎల్ మాట్లాడుతూ అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం ఈ దేశంలో దేశమంతా అన్ని రాష్ట్రాల్లో జిల్లాల్లో సేవ్ నేషన్ సేవ్ కానిస్టిట్యూషన్ అనే అంశంపై వాళ్ళని కార్యక్రమాన్ని నిర్వహించింది. రాజ్యాంగంలోని పీఠిక లో ఉన్నటువంటి ప్రధాన అంశాలను సామాజిక ఆర్థిక రాజకీయ రంగాలలో పౌరులకు సమాన అవకాశాలు కల్పించాలని, శాంతి ,అభ్యుదయం సోషలిజం . సెక్యులరిజం, మత సామరస్యం  లక్ష్యాలను నెరవేర్చుకునే దిశగా పార్టీలకతీతంగా సాధించుకోవటానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కాచం ఫౌండేషన్ చైర్మన్ కాచం సత్యనారాయణ మాట్లాడుతూ అంబేద్కర్ చేసిన పోరాటాన్ని సేవలను కొనియాడారు. రాజ్యాంగం అమలు కొరకు అఖిలభారత శాంతి సంఘీభావ సంఘం పోరాడుతుందని దేశంలోనే ప్రతి ఒక్కరు మన దేశాన్ని ఒక్కతాటిపై నడిపించిన రాజ్యాంగం అమలు కొరకు ధైర్యంగా ముందుకు వచ్చి పోరాడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి అనూష, రంగారెడ్డి జిల్లా సమన్వయ ప్రధాన కార్యదర్శి పోలగని రవి కిషోర్ జిల్లా కార్యదర్శి జే కే శ్రీనివాస్ మాట్లాడుతూ రాజ్యాంగం ఇచ్చిన హక్కులను, స్వేచ్ఛను, అనుభవిస్తున్న మనం అంబేద్కర్ స్ఫూర్తితో శాంతి సాధన కొరకు కృషి చేయాలని  అన్నారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా కార్యదర్శి ఇరుగు శ్రీధర్. అరుణ్ అంబేద్కర్, సాయికుమార్, మాస్టార్జీ సాగర్,  రవీందర్ రెడ్డి, రాములు, తదితరులు పాల్గొన్నారు.

Tags: