అదనపు కలెక్టర్ రైస్ మిల్లుల తనిఖీ

అదనపు కలెక్టర్  రైస్ మిల్లుల  తనిఖీ

విశ్వంభర, మహబూబాబాద్: బుధవారం మహబూబాబాద్ పట్టణంలోని శ్రీ సాయి, జగదాంబ రైస్ మిల్లులను అదనపు కలెక్టర్ (రెవిన్యూ) కె.వీరబ్రహ్మచారి, ఆకస్మికంగా తనిఖీ చేశారు.  ఈ సందర్భంగా ఆయన రైస్ మిల్లులోని రికార్డులను పరిశీలించారు.  ప్రభుత్వం సూచించిన  జిల్లా లక్ష్యం ప్రకారం కస్టమ్ మిల్లింగ్ రైస్ (సిఎంఆర్) డెలివరీలను షెడ్యూల్ ద్వారా వెంటనే చేయాలన్నారు. 
ఖరీఫ్ 2024 -25 కు సంబంధించి సీఎంఆర్ లక్ష్యాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వేగంగా చేయాలని మిల్లర్లను ఆదేశించారు. 
మిల్లులకు సంబంధించి పూర్తి వివరాల రికార్డులను క్రమం తప్పకుండా నమోదు చేసుకోవాలన్నారు, 
జిల్లా యంత్రాంగం సంబంధిత శాఖలు నిత్యం రైస్ మిల్లులను తనిఖీలు నిర్వహిస్తామని ఇట్టి విషయంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఆయన వెంట జిల్లా పౌరసరఫరాల అధికారి ప్రేమ్ కుమార్, డిఎం సివిల్ సప్లై కృష్ణవేణి, సంబంధిత సిబ్బంది ఉన్నారు.

Tags: