తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో అక్రమ కట్టడాలు

తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో అక్రమ కట్టడాలు

  •  పట్టించుకోని అధికారులు
  •  నిద్రమత్తులో పాలకవర్గం

విశ్వంభర, సంగారెడ్డి: తెల్లపూర్ మున్సిపల్ పరిధిలో అడ్డగోలుగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్న చర్యలు తీసుకోవాల్సిన అధికారులు కన్నెత్తి చూడడం లేదు. నగరానికి ఊత వేటు దూరం లో ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ముత్తంగి అక్రమ నిర్మాణాల పట్ల ఎలాంటి చర్యలకు తెల్లాపూర్ మున్సిపల్ కమిషనర్ నోచుకోలేదు. ఇటీవల తెల్లాపూర్ మున్సిపాలిటీలోకి ముత్తంగి గ్రామపంచాయతీని విలీనం చేశారు. అయితే విలీన ప్రక్రియ ముగిసి సుమారు ఏడు, ఎనిమిది నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు తేల్లాపూర్ మున్సిపల్ అధికారులు ముత్తంగిపై దృష్టి సారించినట్లు కనిపించడం లేదు. ఇక్కడ ఎటు చూసినా అక్రమ నిర్మాణాలు ఏ నిర్మాణదారుడు కనీసం నిబంధనలను పాటించడం లేదు. అనుమతులు తీసుకున్నది ఒకటి, నిర్మించేదొకటి. ముత్తంగి గ్రామపంచాయతీ లో జి ప్లస్ టు పర్మిషన్ తీసుకొని యదేచ్ఛగా జి ప్లస్ 4,5 నిర్మాణాలను నిర్మిస్తున్నారు. తెల్లాపూర్ మున్సిపాలిటీలో విలీనమైన ఇప్పటివరకు టౌన్ ప్లానర్ అధికారులు ఆఫీసుల కుర్చీలకే పరిమితం కావడంతో అక్రమార్కులు అక్రమ నిర్మాణాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని విమర్శలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. ముత్తంగి లో ఎటు చూసినా అక్రమ నిర్మాణాలు  పలు రాజకీయ నాయకుల అండదండలు చల్లని చూపులతో  యదేచ్చగా నిర్మాణాలు  చేపడుతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. తెల్లాపూర్  మున్సిపల్ అధికారుల ఉదాసీన వైఖరి వల్ల అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయని విమర్శలు వెలువెత్తుతున్నాయి. అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేసి మున్సిపల్ ఆదాయాన్ని పెంచాలన్న సంకల్పంతో రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల్లో ప్రభుత్వం ఇటీవల వార్డు అధికారులను కొత్తగా నియమించింది. వీరు మున్సిపాలిటీలో జరుగుతున్న అనుమతి లేని నిర్మాణాలను గుర్తించి టౌన్ ప్లానింగ్ అధికారులకు నివేదిక ఇవ్వాల్సి ఉంది. వారి నివేదిక ఆధారంగా అక్రమ నిర్మాణాలపై టౌన్ ప్లానింగ్ అధికారులు చర్యలు చేపట్టాల్సి ఉంది. కానీ చర్యలు తీసుకోవాల్సిన టౌన్ ప్లానింగ్ అధికారులు నివేదికలకు తిలోదకాలిస్తూ ఔట్సోర్సింగ్ విధులు నిర్వహిస్తున్న ఛైర్మన్లకే ప్రాధాన్యం ఇస్తూ సదరు సిబ్బంది చెప్పిందే వేదం అన్నట్లు సాగుతుండడంతో అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్టపడటం లేదంటూ పలువురు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా ఈ అక్రమ నిర్మాణాలపై నిద్రమత్తు వీడి తెల్లాపూర్ మున్సిపల్ అధికారులు, జిల్లా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోగలరని ప్రజలు కోరుతున్నారు.

Tags: