లక్ష్యంతో చదువుకుంటే భవిష్యత్తులో మంచి అవకాశాలు - ఘనంగా ఎన్నారై కళాశాల  2025-26 ఫ్రెషర్స్ డే వేడుకలు

డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ ఉస్మానియా యూనివర్శిటీ ప్రొఫెసర్ డాక్టర్ డి. చెన్నప్ప

లక్ష్యంతో చదువుకుంటే భవిష్యత్తులో మంచి అవకాశాలు -   ఘనంగా ఎన్నారై కళాశాల  2025-26 ఫ్రెషర్స్ డే వేడుకలు

విశ్వంభర, హనుమకొండ జిల్లా: విద్యార్థులు శ్రద్ధగా అంకితభావంతో చదువుకుంటే భవిష్యత్తులో తాము అనుకున్నది సాధించవచ్చు అని డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ ఉస్మానియా యూనివర్శిటీ ప్రొఫెసర్ డాక్టర్ డి. చెన్నప్ప తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం భీమారంలోని ఎంఎన్ఆర్ గార్డెన్ లో 2025-26 ఫ్రెషర్స్ డే వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశ ఎంతో కీలకమని పాఠశాల అనంతరం ఇంటర్మీడియట్ విద్య ఎంతో కీలకమని అన్నారు.  పలు విభాగాల కోర్సులు ఉంటాయని విద్యార్థులు ఎంపిక చేసుకున్న కోర్సులలో పట్టుదలతో చదువుకుంటే భవిష్యత్తులో ఆయా గ్రూపులలో శ్రద్ధ కనబరిస్తే ఉన్నత చదువులకు మైలురాయి అవుతుందన్నారు. పోటీ ప్రపంచంలో విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు చెందుతున్నప్పటికీ ఇప్పటినుండి భవిష్యత్ ప్రణాళికలను సిద్ధం చేసుకుని కష్టపడి చదువుకుంటేనే విద్యార్థులు అనుకున్న లక్ష్యాలను సాధించేందుకు ఉపయోగపడుతుందన్నారు. ఈ సందర్భంగా ఫ్రెషర్స్ డే వేడుకలను ఏర్పాటు చేసిన కళాశాల యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. అనంతరం కళాశాల చైర్మన్ షోభా రెడ్డి మాట్లాడుతూ ఎన్నారై కళాశాలలో చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులకు నిష్ణాతులైన  అధ్యాపకులు బోధన అందిస్తున్నట్లు తెలిపారు. కళాశాలలో విద్యార్థులకు అన్ని వసతులతో కూడిన సౌకర్యాలు కల్పిస్తున్నట్లు వివరించారు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో ఇంటర్మీడియట్ పరీక్షల్లో విద్యార్థుల ఉత్తీర్ణత శాతం రాష్ట్ర, జాతీయస్థాయిలో తమ కళాశాల విద్యార్థిని విద్యార్థులు ప్రతిభ కనబరిచారని పేర్కొన్నారు. నీట్, జేఈఈ, మెయిన్స్, అడ్వాన్స్ పరీక్షల్లో ఎన్నో ర్యాంకులు సాధించారని ఈ సందర్భంగా ఎన్నారై కళాశాల చైర్మన్ షోభా రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్లు ఎన్. శ్రీనివాస్, ఎం. దేవేందర్, పి. మౌనిక, ప్రిన్సిపాల్ జక్కుల రాజు యాదవ్, కళాశాల సిబ్బంది, జూనియర్, సీనియర్ విద్యార్థులు పాల్గొన్నారు.

Tags: