కేసీఆర్ ను వేధిస్తే ప్రభుత్వం పై తిరుగుబాటు తప్పదు. - EX MPP , BRS మండల అధ్యక్షులు - తాటికొండ సీతయ్య
విశ్వంభర, తుంగతుర్తి :- కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ సాధన ఉద్యమ నేత మాజీ ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ని తప్పుడు నోటిస్ లు ఇచ్చి విచారణ పేరుతో వేధించాలని చూస్తే ప్రజలు తిరగ బడతారని హెచ్చరించారు. తుంగతుర్తి బిఆర్ ఎస్ పార్టీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన సమావేశం లో విలేకరులతో మాట్లాడుతూ గత 18నెలలు గా కాంగ్రెస్ ప్రభుత్వం అబద్దాలతో, తప్పుడు ఆరోపణలతో ప్రతిపక్ష నాయకులు. Kcr. Ktr. హరీష్ రావు.. జగదీష్ రెడ్డి. ల మీద కేసులు పెట్టి వేదిస్తూ పాలన మరిచి పోయిందని అన్నారు.. కాళేశ్వరం వల్ల ప్రజలకు ఏమి నష్టం జరిగిందని ప్రశ్నించారు. అతి తక్కువ కాలంలో దేశం లోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గోదావరి నది పై నిర్మించిన గొప్ప అపర భగీరధుడు kcr అన్నారు.. తెలంగాణ రాష్ట్రం లో కరువు తో అల్లాడుతున్న గోదావరి పరివాహక ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవడం కోసం కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించి గత ఆరు సంవత్సరాలు నిరంతరాయంగా రైతంగాని కి పంటలకు నీళ్లిచి ఆదుకొని ఆర్ధికంగా బలోపేతం చేసినందుకా kcr కు నోటిస్ లని అన్నారు.. Kcr గారి దార్షానికత తో హరీష్ గారి నిబద్దత తో ప్రాజెక్ట్ నిర్మించి నీళ్లు పారిస్తే పంటలు పండించుకొని రైతులు. అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉంటే ఓర్వాలేని కాంగ్రెస్ ప్రభుత్వం ఇసుక వ్యాపారం కోసం మెడిగడ్డ కూలిందని చెప్పి నీళ్లు ఇవ్వకుండా పంటలు ఎండ బెట్టి.. చేతి కొచ్చిన సగం పంటనైనా అమ్ముకుందామని ikp సెంటర్ల లో పోసి రెండు నెలలైన కొనుగోలు చేయకుండా రైతుల్ని దివాలా తీయించిన మీరు నోటీసులతో. విచారణ పేరుతూ వేధిస్తే ప్రభుత్వం పై ప్రజల తిరుగు బాటు తప్పదని హెచ్చరిక చేస్తున్నాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో brs నాయకులు బొంకూరి మల్లేష్. బొజ్జ సాయి కిరణ్. గోపగాని వెంకన్న పాల్గొన్నారు.