భద్రాచలం దేవస్థానానికి ఆదర్శ నేత – ఎల్. రమాదేవి
విశ్వంభర,భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం కార్య నిర్వహణ అధికారి ఎల్. రమాదేవి గారు సామర్థ్యం, నిబద్ధత, సేవా హృదయం కలిగిన వ్యక్తిత్వం. ఆలయ అభివృద్ధి కోసం తనదైన శైలిలో నాయకత్వాన్ని ప్రదర్శిస్తూ, ప్రతి నిర్ణయాన్ని ధైర్యంగా, ధర్మబద్ధంగా తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు.ఆమె సిబ్బందిని కుటుంబ సభ్యుల్లా చూసుకుంటూ, వారి సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు. భద్రాద్రి ఆలయ ఆదాయాన్ని పెంచడంలో, భక్తుల సౌకర్యాలను మెరుగుపరిచేలా తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయం.సేవా కార్యక్రమాల్లో తన స్వంత ఖర్చుతో పాలుపంచుకుంటూ, భక్తుల బాగోగులు చూసుకునే మానవత్వం ఆమెను ప్రత్యేకతను చాటుతుంది. దేవస్థాన పాలనలో ఆమె క్రమశిక్షణ, శక్తివంతమైన నిర్ణయాలు, ఆలయ శ్రేయస్సుకు దోహదపడుతున్నాయి.ఆమె ధృడనిశ్చయం – ఆలయ అభివృద్ధికి వేదికఆమె కోపం న్యాయసిద్ధమైన ధైర్యానికి సంకేతం, ఆమె ఆదరణ సిబ్బందికి ఆత్మవిశ్వాసాన్ని నింపే విజయసూచకం. దేవస్థానం అభివృద్ధిలో సకల కోణాల్లో సమర్థమైన పాలన అందిస్తూ, భద్రాద్రి రామాలయాన్ని శ్రద్ధా, భక్తి, సేవా ధ్యేయాలతో ముందుకు తీసుకెళ్తున్నారు.భద్రాచలం దేవస్థానానికి పెద్ద ఆడబిడ్డగా, ఆలయ నిర్వహణలో సామర్ధ్యం, మానవత్వం, కట్టడి అన్న మూడింటినీ సమతుల్యంలో ఉంచుతూ తనదైన శైలిలో పాలన సాగిస్తున్న ఆమె, భద్రాచలంలో చిరస్థాయి గుర్తింపు పొందారు.



