చిట్యాల వాసి బొడ్డు బాబురావుకు గౌరవ డాక్టరేట్
- మనం ఫౌండేషన్ ఇంటర్నేషనల్ సంస్థ ద్వారా గౌరవ పురస్కారం
- అభినందనలు తెలిపిన సమాచార హక్కు ప్రజా చైతన్య సమితి సభ్యులు
విశ్వంభర, చిట్యాల : సమాచార హక్కు ప్రజా చైతన్య సమితి అధ్యక్షులు బొడ్డు బాబురావు గౌరవ డాక్టరేట్ పురస్కారం అందుకున్నారు. సమాచార హక్కు ప్రజా చైతన్య సమితి ద్వారా ప్రజలకు ఎన్నో అవగాహన కార్యక్రమాలు , సదస్సులు ఏర్పాటు చేసి ప్రజలను చైతన్యవంతులుగా చేయడం జరిగింది. ఈ సమితి ద్వారా ప్రజలకు సామాజిక సేవ కార్యక్రమాలను చేస్తూ నిరంతరం వారికి అండగా ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఈ సందర్బంగా చేస్తున్న సేవ కార్యక్రమాల ద్వారా వారిని గుర్తించి మనం ఫౌండేషన్ ఇంటర్నేషనల్ సంస్థ వారి ఆధ్వర్యంలో పురస్కారం అందజేశారు. మాచార హక్కు ప్రజా చైతన్య సమితి సభ్యులు వారికి పూలమాల వేసి శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కొండ వెంకట లక్ష్మి , పిల్లి ధనలక్ష్మి , విపూరి సుదర్శన్ , జిట్ట నర్సింహా రాజు , జిల్లాల గోవర్ధన్ రెడ్డి, పందుల పాండరి , గాదె మల్లేష్ సమితి సభ్యులు, వారితో పాటు స్థానిక నాయకులు , ప్రజా ప్రతినిధులు , ప్రజలు పాల్గొన్నారు.



