బిగ్ అలర్ట్... తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ రిలీజ్...పూర్తి వివరాలు ఇవే...!

బిగ్ అలర్ట్... తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ రిలీజ్...పూర్తి వివరాలు ఇవే...!

విశ్వంభర, వెబ్ డెస్క్ : తెలంగాణలో ఇంజినీరింగ్ సీట్ల భర్తీకి నిర్వహించిన ఈఏపీ సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ను విద్యాశాఖ అధికారులు శుక్రవారం విడుదల చేశారు. ఈ కౌన్సెలింగ్‌ పక్రియ మొత్తం 3 విడతల్లో ప్రవేశాలను నిర్వహించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది.

 ఈ నేపథ్యంలో జూన్‌ 27 తేదీ నుండి ప్రవేశాలను మొదలు పెట్టాలని ఉత్తర్వులను జారీ చేసింది. ఇక ప్రక్రియలో భాగంగా జూన్‌ 30 తేదీ నుండి మొదటి విడత వెబ్‌ ఆప్షన్లకు ఆవకాశం ఇవ్వనున్నారు. ఇక చివరగా మొదటి విడత సీట్ల కేటాయింపు జూలై 12వ తేదీన జరగనుంది.

Read More మైనారిటీ వెల్ఫేర్ గురుకుల పాఠశాల సందర్శించిన టీపీసీసీ సీనియర్ కాంగ్రెస్ నాయకులు 

ఆ తదుపరి జూలై 19వ తేదీ నుంచి రెండో విడత కౌన్సెలింగ్‌ మొదలు కానుంది. రెండో విడతలో జూలై 24 తేదీ సీట్ల కేటాయింపు జరుగును. ఇక చివరి మూడో విడత కౌన్సిలింగ్‌ ను జూలై 30 తేదీ మొదలు పెట్టి.. ఆగస్టు 5 తేదీన సీట్లు కేటాయించబోతున్నట్లు అధికారులు తెలిపారు. 

ఆ తర్వాత ఆగస్టు 12వ తేదీ నుంచి ఏదైనా ఇంటర్నల్‌ స్లైడింగ్‌ సీట్ల కేటాయింపులను చేపట్టనున్నారు. ఇక చివరగా ఆగస్టు 17 తేదీన స్పాట్‌ ఆడ్మిషన్ల మార్గదర్శకాలు విడుదల కాబోతున్నాయి.