ఘనంగా మహిళా దినోత్సవం

ఘనంగా మహిళా దినోత్సవం

విశ్వంభర, ఆమనగల్లు: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని అమనగల్లు పట్టణ కేంద్రంలోని సూర్య లక్ష్మి కాటన్ మిల్ వద్ద భారతీయ మజ్దూర్ సంఘ్ కార్మిక సంఘం అధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సంధర్భంగా కేక్ కట్ చేసి మహిళలకు పంచి పెట్టి శాలువతో ఘనంగా సన్మానించారు. త్యాగానికి మారుపేరు మహిళ అని, మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం వెనుక కూడా ఎందరో మహిళల త్యాగం ఉందని గుర్తుచేశారు. మహిళా దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు. మహిళలు తమ శక్తిని తెలుసుకోని అన్నిరంగాల్లో తమను తాము నిరూపించుకోవాలన్నారు. ఈ వేడుకలలో భారతీయ మజ్దూర్ సంఘ్ జనరల్ సెక్రటరీ బి. లక్య నాయక్, వైస్ ప్రెసిడెంట్ యాదయ్య, శంకర్ రావు, మాలిక్, అలివేలు, సాయమ్మ, రాములమ్మ తదితరులు ఉన్నారు.

Tags: